జ్యో అచ్యుతానంద ట్రైలర్ విడుదల | Jyo Achyutananda Theatrical Trailer Released

Jyo achyutananda theatrical trailer released

Jyo Achyutananda Theatrical Trailer, Jyo Achyutananda Trailer Talk, Jyo Achyutananda story, Jyo Achyutananda story leak, Jyo Achyutananda hollywood copy, Nara Rohit Jyo Achyutananda, Naga Shourya Jyo Achyutananda, regina Jyo Achyutananda

Jyo Achyutananda Theatrical Trailer Released.

జ్యో అచ్యుతానంద: కూల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

Posted: 08/22/2016 01:12 PM IST
Jyo achyutananda theatrical trailer released

తెలుగులో ఫీల్ గుడ్ సినిమాలు అడపా దడపా వస్తుంటాయి. నెమ్మదిగా సాగే కథా, కథనంతో కూడా సక్సెస్ కొట్టిన దాఖలాలు చాలానే ఉన్నాయి. నటుడి నుంచి దర్శకుడిగా మారిన అవసరాల శ్రీనివాస్ తన తొలి చిత్రాన్ని ఇలాంటి ప్రయత్నంతోనే చేసి ఊహలు గుసగుసలాడే అంటూ మాంచి హిట్ కొట్టాడు. ఇప్పుడు తన రెండో చిత్రం జ్యో అచ్యుతానంద కూడా ఆ కోవలోనికే చెందుతుందేమో అనిపిస్తోంది.

ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఓ లుక్కేస్తే... అన్నదమ్ములు లిద్దరూ ఒకే అమ్మాయికి బీట్ వేయటం, ఆమె కూడా వారితో క్లోజ్ గా మూవ్ కావటం ఇది వరకు చాలా చిత్రాల్లోనే వచ్చినప్పటికీ, స్క్రీన్ ప్లే, కెమెరా మోడ్ లో ఈ సినిమాలో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది.

నారా రోహిత్, నాగశౌర్య, రెజీనాలు తమ పాత చిత్రాల కంటే టోటల్ డిఫరెంట్ గా కనిపించడం, పైగా అన్నదమ్ములుగా ఈ ఇద్దరు హీరోల గెటప్ లు, వేరియేషన్, డైలాగ్ డెలివరీలు ట్రైలర్ లో చాలా విచిత్రంగా కనిపిస్తున్నాయి. మెలోడీయస్ బ్యాగ్రౌండ్ తో ఓ ట్రయాంగులర్ లవ్ స్టోరీని డిఫరెంట్ గా ప్రయత్నం చేశాడు. ఈ లెక్కన అవసరాల ఖాతాలో మరో హిట్ పడేలాగానే ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jyo Achyutananda  Theatrical Trailer  Nara Rohit  Naga Shourya  Regina  

Other Articles