చిరంజీవి 150 సిినిమా ప్రీ లుక్ పోస్టర్ విడుదల | chiranjeevi 150 pre look poster released

Chiranjeevi 150 pre look poster released

chiranjeevi 150 pre look poster, chiru 150 first look, Chiru 150 movie poster, chiru 150 updates, chiru 150 release date

chiranjeevi 150 pre look poster released.

చిరు 150 ఫ్రీ లుక్ పోస్టర్

Posted: 08/19/2016 09:47 AM IST
Chiranjeevi 150 pre look poster released

దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత హీరోగా చిరు తెరమీద ఎలా కనిపిస్తాడో అన్న ఉత్కంఠ అభిమానుల్ని ఊపేస్తోంది. ఇప్పటికే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైన రోజు చిరు లుక్ చూసి అభిమానులు సంతోషం పట్టలేకపోయారు. మొదలుపెట్టిన రోజు నుంచి నిర్విరామంగా షూటింగ్లో పాల్గొంటున్నాడు చిరు. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఈ సినిమాలో చిరు లుక్ ఎలా ఉంటుందో అభిమానులకు పరిచయం చేయడానికి మంచి ముహూర్తం కూడా కుదిరింది. టైటిల్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నెల 22న ఫస్ట్ లుక్ పోస్టర్ మీద ఏం పేరు ఉంటుందో అని కూడా ఉత్కంఠతో ఉన్నారు ఫ్యాన్స్.

సోమవారం చిరంజీవి పుట్టిన రోజు. ఆ రోజే చిరు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గానే సమాచారం ఇచ్చారు. ఇంతో దీనిని కన్ఫర్మ్ చేస్తూ  ఫ్రీ లుక్ పోస్టర్ ను గురువారం సాయంత్రమే రిలీజ్ చేశాడు చెర్రీ. ఓ మ్యాప్.. దానికి ముందు రెడ్ కలర్ కర్టెన్ ఆ పోస్టర్ లో కనిపిస్తాయి. హైద్రాబాద్ మ్యాప్ అని అర్ధమయ్యేందుకు కర్టెన్ పై బుద్ధుడుని.. చార్మినార్.. గోల్కొడ కోటలను చూపించారు. మ్యాప్ పై అండర్ గ్రౌండ్ ని చూపించారు లెండి. ఈ థీమ్ ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే కానీ.. కర్టెన్ రైజర్ పోస్టర్ ని చూసి.. ఫ్యాన్స్ ఆనందంతో కేకలు పెట్టేస్తున్నారు.

ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలా ఉంటుందో అభిమానుల్లో కౌంట్ డౌన్ మొదలైపోయింది. ఫస్ట్ లుక్ రిలీజ్ కోసమని ఒక టీమే పని చేస్తోంది కొన్ని రోజులుగా. అనిల్-భాను ఈ పోస్టర్ తయారు చేస్తున్నారు. మరి చిరు తన పుట్టిన రోజు నాడు అభిమానులకు ఎలాంటి అనుభూతినిస్తాడో పంచబోతున్నాడో చూద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Megastar  Chiranjeevi  150  pre look poster  

Other Articles