తిరునాల్ లిప్ లాక్ పై అనవసర రాద్ధాంతం | Nayanthara's 'innocent' kiss Tirunal controversy

Nayanthara s innocent kiss tirunal controversy

Nayanthara's 'innocent' kiss, Tirunal movie, Tirunal liplock, tirunal child abusive, nayanatara kiss, nayanatara child

Nayanthara's 'innocent' kiss Tirunal controversy. A school boy lip lock with nayanatara.

అబ్బా! నయన్ లిప్ కిస్ పై ఏందీ లొల్లి

Posted: 08/11/2016 05:43 PM IST
Nayanthara s innocent kiss tirunal controversy

సినిమాలో కాస్త ఎక్స్ పోజింగ్ కనిపిస్తే (చూపిస్తే) చాలూ అయ్య బాబోయ్ వీళ్ల వల్లే కదా పిల్లలు పాడయిపోతున్నారంటూ గొణిగే మనుషులు ఉన్న ఈ రోజుల్లో... సరదాగా ఫన్నీ కోసం చూపించే బోల్డెన్నీ సన్నివేశాలు అనుకోకుండా కాంట్రవర్సరీకి కారణమౌతున్నాయి. మచ్చుకు ఓ ఉదాహరణ...

గత వారం కోలీవుడ్ లో తిరునాల్ అనే ఓ సినిమా వచ్చింది. జీవా-నయనతార హీరోహీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా బొక్కా బోర్లా పడటమే కాదు, పాపం వరుసగా ఆరు హిట్లతో ఎదురులేకుండా ఉన్న నయన్ కు ఫ్లాప్ చవిచూడాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ సీన్ పై తమిళనాట తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఓ సన్నివేశంలో స్కూల్ స్టూడెంట్స్ కి చాకెట్లు ఆఫర్ చేస్తుంది నయనతార. కానీ, అందుకు ప్రతిఫలంగా తన చెంపపై ముద్దుపెట్టాలని వారిని కోరుతుంది. కానీ, ఓ కొంటె కుర్రాడు మాత్రం ఏకంగా నయన్ లిప్స్ పైనే ముద్దు పెట్టేస్తాడు. అంతే చిన్నపిల్లలను పాడుచేస్తున్నారంటూ కొందరు ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నారు. ఇంకోందరైతే ఏకంగా చిన్న పిల్లలపై లైంగిక వాంఛ తీర్చుకున్నారంటూ కేసు పెట్టేందుకు సిద్ధమైపోతున్నారు. ఈ పిచ్చికి ఏం పేరు పెట్టాలో అర్థం కావటం లేదు.

గతంలో సన్నీలియోన్ ఓ పాఠశాలను సందర్శించినప్పుడు కూడా ఇలానే విమర్శలు చెలరేగాయి. ఓ పోర్న్ స్టార్ బడి పిల్లల దగ్గరికి వెళ్తే వారు పాడైపోవటం తప్పించి మరేం ఉండదని వాదించిన వారు ఉన్నారు. సపోజ్ ఫర్ సపోజ్ నయనతార ప్లేస్ లో ఏ టాప్ హీరో ఉన్నాడనుకోండి, ఆ పిల్లాడి ప్లేస్ లో ఓ చిన్న పిల్ల ఉంది అనుకోండి. అప్పుడు కూడా ఇలాగే రాద్ధాంతం చేస్తారా? లేదు కదా. కేవలం హీరోయిన్ అన్న ఒకే ఒక కారణంతో ఇలా ఆడేసుకుంటున్నారని వాదించేవాళ్లు లేకపోలేదు. ఏదేమైనా ఫ్లాప్ టాక్ వచ్చిన ఈ సినిమాకి ఈ లిప్ లాక్ కాంట్రవర్సరీతో ఫ్రీ పబ్లిసిటీ మాత్రం తెగ వచ్చేస్తోంది.

అన్నట్లు మన మీడియా మాధ్యమాలు మాత్రం దీనిని వదులుకుంటాయా? నయనతార హాట్ లిప్ లాక్, లక్కీ స్కూల్ బాయ్ లిప్ లాక్ విత్ నయనతార అంటూ హెడ్డింగ్ లు పెట్టి న్యూస్ లు రాసేస్తున్నాయి. ఇక నెటిజన్లు ఏమో ఈ ఘటనలపై ఫన్నీ కామెంట్లతో కాలం గడిపేసుకుంటున్నారు. ఎవరిగోల వారిది.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nayanatara  tirunal  liplock  controversy  

Other Articles