రామ్ హైపర్ ఫస్ట్ లుక్ విడుదల | ram hyper first look released

Ram hyper first look released

ram hyper movie, hyper director, hyper movie actress, Hyper movie First look

Ram Hyper First look released.

కథలు దొరక్క ఏదో ఒకటి చేస్తున్నాడా?

Posted: 08/03/2016 12:37 PM IST
Ram hyper first look released

ఎనర్జిటిక్ హీరో రామ్ వరుసగా ఒకే పంథా సినిమాలు తీస్తూ జనాల సహనాన్ని పరిక్షించిన స్టార్లలో ఒకడు. వరుస అట్టర్ ఫ్లాప్ ల తర్వాత ఎట్టకేలకు నేను శైలజతో ఈ యేడాది ఘనమైన ఆరంభాన్నే ప్రారంభించాడు. నిజానికి సినిమాలో ఉంది పెద్ద కంటెంట్ ఏం కాదు. కానీ, ఊర మాస్ వేషాలు, అతి ఏం చేయకుండా సింపుల్ యాక్షన్ చేయటంతో ప్రేక్షకుడు రెండున్నర గంటల పాటు థియేటర్ లో ఒపికగా కూర్చోగలిగాడు.

Ram Hyper

సరైన కథలు దొరక్కపోవటంతో కాస్త ఆలస్యంగానైనా తనకు కందిరీగ హిట్ ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్ తో హైపర్ గా మన ముందుకు వచ్చాడు. సంతోష్ ఆ మధ్యే ఎన్టీఆర్ తో రభస చేసి బొక్కా బోర్లాపడి ఉన్నాడు. దీంతో తనకు కలిసొచ్చిన రామ్ తోనే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమా తీయాలని చూస్తున్నాడు. అందుకు తగ్గట్లే హైపర్ ఫస్ట్ లుక్ ఉంది కూడా.

హైపర్ ప్రతి ఇంట్లో ఒకడుంటాడు అనే కాప్యన్ తో ఫస్ట్ లుక్ సింపుల్ గానే ఉంది. ఫస్ట్ లుక్ లపై పెద్దగా హడావుడి చేస్తున్న తరుణంలో కళ్లజోడు ఎగరేసుకుంటూ నడిచి వచ్చే రామ్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. పోస్టర్ చూసిన వాళ్లంతా లుక్కులో ఏముందిలే కథలో కొత్తదనం, అతి లేకుండా ఉంటే చాలని అనుకుంటున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram  Rashi khanna  Hyper  first look  santhosh srinivas  

Other Articles