పవన్ కళ్యాణ్ కథతో త్రవిక్రమ్ సినిమా | trivikram direct pawan kalyan story

Trivikram direct pawan kalyan story

power star pawan kalyan writer, trivikram direct pawan story, pawan story trivikram, trivikram using pawan story

Trivikram direct pawan kalyan story.

పవర్ స్టార్ కథకు ఓకే చెప్పిన త్రివిక్రమ్ ???

Posted: 07/30/2016 10:16 AM IST
Trivikram direct pawan kalyan story

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ లు కలిసి చేసే మ్యాజిక్ లు అంతా ఇంత ఉండవు. జల్సా, అత్తారింటికి దారేది రెండూ ట్రెండ్ సెట్టర్ సినిమాలే. వీరి కాంబినేషన్ లో మరో సినిమా అతి త్వరలో ఉండబోతుందని అనుకుంటుండగానే మరో ఆసక్తికరమైన వార్త ఒకటి బయటికి వచ్చింది.

పవన్ కల్యాణ్ లో మంచి నటుడు, దర్శకుడు మాత్రమే కాకుండా రచయిత కూడా దాగి వున్నాడు. అందుకే, తన సినిమాలకు సంబంధించిన స్క్రిప్టు పనిలో ఆయన పూర్తిగా ఇన్వాల్వ్ అవుతుంటారు. ఆయా రచయితలకు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. జానీ, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలకు కథ అందించింది పవనేనని తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన రాసిన ఇంకో కథ త్వరలో తెరకెక్కనుందట.

పవన్ స్నేహితుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దీన్ని డైరక్షన్ చేయనున్నట్లు చెబుతున్నారు. వీరిద్దరు కలిసి కూర్చుంటే ఎక్కువగా రచనల గురించే సంభాషించుకుంటారు. అలా ఇటీవల కలసినప్పుడు పవన్ చెప్పిన కథ త్రివిక్రమ్ కు బాగా నచ్చిందట. దీంతో త్వరలో ఆయన దానిని తెరమీద ఆవిష్కరించనున్నట్టు చెబుతున్నారు. అయితే, ఇందులో పవన్ నటిస్తారా? లేక మరొకరు నటిస్తారా? అన్నది ఇంకా వెల్లడి కాలేదు. ప్రస్తుతం పవన్ డాలీ సినిమా కోసం రెడీ అవుతుండగా, త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్టుపై ఇంకా ఏం స్పష్టత లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Trivikram  pawan kalyan  story  movie  

Other Articles