చిరు 150 ప్రీ రిలీజ్ బిజినెస్ | Mega Pre Release Business Record For Chiru 150

Mega pre release business record for chiru 150

chiru 150 pre business, chiru movie rights, Chiranjeevi 150 movie pre release business, ram charan lavish budget for father, ram charan safe with chiru movie

Mega Pre Release Business Record For Chiru 150.

చిరు స్టామినా తేలేది అక్కడే

Posted: 07/27/2016 10:46 AM IST
Mega pre release business record for chiru 150

చిరంజీవి 150వ సినిమా కత్తి రీమేక్ చకచకా షూటింగ్ జరుపుకుంటోంది.  షూటింగ్ దశలోనే  ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలైపోయింది. అయితే విజయ్ కత్తి సినిమా అల్రెడీ సౌత్ లో పరిచయం ఉండటంతో తమిళ్ తోపాటు మళయాళంలో డబ్బింగ్ అనుమానమే అని అనుకుంటున్నారు. ఇక హిందీలో అయితే అక్షయ్ కుమార్ రీమేక్ చేసేస్తున్నాడు. ఈ దశలో తెలుగుతోనే భారీ లాభాలు అర్జించడం కష్టమే.

ఇప్పటికే ఈ సినిమా సీడెడ్ .. ఈస్ట్ గోదావరి జిల్లాల ఏరియా హక్కులకు సంబంధించిన డీల్స్ పూర్తయినట్టు చెబుతున్నారు. వైజాగ్ ఏరియా హక్కుల విషయంలో గట్టి పోటీ వున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారీ రేటును చెల్లించి ఎవరు ఈ రైట్స్ ను దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

దాదాపు 70 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరగవచ్చని అనుకుంటున్నారు. ఈ సినిమాకి నిర్మాత చరణ్ కావడంతో, ఎక్కువ రేటు చెల్లిచడానికి డిస్ట్రిబ్యూటర్లు వెనుకాడం లేదట. మరి ఎక్కువ స్క్రీన్ లలో రిలీజ్ చేస్తేనే తప్ప అది రికవరీ కావటం కష్టం.  సంక్రాంతి బరిలో ఇప్పటికే బాలయ్య గౌతమీ పుత్ర శాతకర్ణి (జనవరి12) ఫిక్స్ చేసేసుకున్నాడు. ఈ దశలో తాను అప్పుడే రిలీజ్ చేసి చిరు రిస్క్ చేయడనే సినీ పెద్దలు భావిస్తున్నారు. అన్నట్లు సినిమాలో కాజల్ ఓకే అయ్యిందన్న వార్త జస్ట్ పుకారే అని చిత్ర యూనిట్ ప్రకటించింది.

- భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chiranjeevi  ram charan  150 movie  vinayak  prerelease business  

Other Articles