కష్టకాలంలో కేథరిన్... | Catherine tresa busy with back to back telugu movies

Catherine tresa busy with back to back telugu movies

Catherine Tresa offers in tollywood, Catherine tresa opposite young heros, Catherine Tresa agin busy in tollywood

Catherine Tresa in full swing back to back with tollywood movies

కష్టకాలంలో కేథరిన్...

Posted: 07/15/2016 09:52 AM IST
Catherine tresa busy with back to back telugu movies

టాలీవుడ్ కు వలస వచ్చిన బ్యూటీలో కేథరిన్ థ్రెసా ఒకరు. అందతోపాటు అభినయం ఉన్నప్పటికీ అవకావాలు లేక కొద్ది కాలం చాలా ఇబ్బంది పడింది. రెండవ కథానాయిక పాత్రలకే పరిమితమై చాలా కష్టంగా కెరీర్ ను నెట్టుకొచ్చింది. ఆ టైంలో తమిళ్ అవకాశాలు ఈ హాట్ బ్యూటీకి అదృష్టాన్ని తెచ్చిపెట్టాయి. విశాల్ కథకలి, అధర్వ కనితన్ సినిమాలు హిట్లు కావటం, అందులో కేథరిన్ నటనకు ఫుల్ మార్కులు పడటంతో తిరిగి తెలుగు ఛాన్స్ లు ఆమెను పలకరిస్తున్నాయి.

ఇలా ఉండగా సరైనోడు ఆమె కెరీర్ ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. సెకండ్ హీరోయిన్ అని చెప్పినప్పటికీ రకుల్ కంటే ప్రాధాన్యం ఉన్న పాత్రలోనే కనిపించింది. దీంతో దర్శకులు ఆమె కోసం క్యూ కడుతున్నారు. ప్రస్తుతం గోపీచంద్, రానా సరసన నటించేందుకు ఓకే చెప్పింది. అదే సమయంలో మరో ఇద్దరు యంగ్ హీరోలతో జోడీ కట్టేందుకు రెడీగా ఉంది. ఇంకో 2 కోలీవుడ్ సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి.

చూస్తుంటే ఇప్పుడున్న టాప్ హీరోయిన్ లకు పోటీ వచ్చిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. అన్నట్లు త్వరలో హైదరాబాద్ కి మకాం మార్చేందుకు ఈ మళయాళీ భామ సిద్ధమైపోతుందట. కెరీర్ లో నకు వస్తున్న ఈ వరుస అవకాశాలతో ఇక కేథరిన్ కష్టాలు ముగిసిపోయినట్లే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Catherine Tresa  tollywood offers  gopi chand  Rana  

Other Articles