hansika doing again with jayam ravi for third time

Hansika doing again with jayam ravi for third time

jayam ravi, hansika, hansika hot, jayam ravi next movie, hansika next movie, bhogan movie, jayam ravi vs hansika, hansika love story, hansika next movie, hansika mvoies, hansika in kollywood

hansika heroine doning tamil films regulary. and she is doing bhogan movie for jayam ravi movie in third time.

అతనితో అది కుదిరింది..!

Posted: 06/29/2016 04:26 PM IST
Hansika doing again with jayam ravi for third time

దేశముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది అందాల ముద్దుగుమ్మ హన్సిక. ఇటీవలే తమిళంలో విడుుదలయిన ఉదయనిధి స్టాలిన్ సినిమా మనిదన్ మంచి ఉత్సాహాన్నిచ్చిందని చెప్తోంది ఈ అమ్మడు. తన తర్వాత సినిమా జయంరవితో ముచ్చటగా మూడోసారి నటిస్తున్నారు ఎందుకు అని అడిగితే, అది తనతో నాకు కెమిస్ట్రీ బాగుంటుందని, జయం రవి తో అలా కుదిరిపోతుందని చెప్తోంది.

ప్రస్తుతం జయంరవితో భోగన్ అనే సినిమా చేస్తున్నానని, నిజానికి అతనితో ఎప్పుడో ఒక సినిమా చెయ్యాల్సిఉందని కానీ అది ఇప్పటికి కుదిరిందని చెప్తోంది.

మనిదన్ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో పల్లెటూరి పిల్లగా చేసేందుకు చాలా కష్టపడ్డానని, దీనికి ముందు సినిమా అరణ్మయిలో నటించడం వల్ల చాలా హెల్ప్ అయ్యిందని చెప్తోంది. అంతేకాదు పెళ్లి ఎప్పుడు హన్సిక అని అడిగితే తెగ సిగ్గుపడిపోతోంది ఈ చిన్నది.

ఇదే ప్రశ్న బయట అడిగితే కొంతకాలం శింబుతో ప్రేమాయణం నడిపిన ఈ అమ్మడు ఇప్పుడు జయం రవితో ప్రేమలో ఉందేమో అంటున్నారు కోలీవుడ్ తంబీలు.

ఏది ఏమైనా, హన్సికను మాత్రం తెగ ప్రేమించేస్తున్నారు తమిళ తంబీలు. కుష్బూ తర్వాత మళ్లీ హన్సికకే అక్కడ గుడి కట్టిన సంగతి తెలిసిందే. మరి ఈ బ్యూటి ఎంతగా ఆకట్టుకుందో వారిని.

కొసమెరుపు ఏంటంటే, జయంరవితో వరుసగా రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట హన్సిక. ఇప్పుడు తెలుగులో సినిమాలు చేసేందుకు అస్సలు టైమ్ కుదరట్లేదంటోంది.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hansika actress  hansika next  hansika hot  hansika with jayam ravi  hansika rumours  

Other Articles