చెర్రీకి అతిపెద్ద సవాల్ | Lavish budget for Charan-sukumar movie

Lavish budget for charan sukumar movie

Charan-sukumar movie, Lavish budget for Cherry movie, Cherry-Sukku movie, Mythri Movie Makers ram charan, రాంచరణ్, మైత్రీ మూవీ మేకర్స్, తాజా వార్తలు, తెలుగు వార్తలు, సినిమా గుసగుసలు

Lavish budget for Charan-sukumar movie. Almost 70 crores expect by Mythri Movie Makers.

చెర్రీకి అతిపెద్ద సవాల్

Posted: 06/28/2016 06:17 PM IST
Lavish budget for charan sukumar movie

మెగా తనయుడిగా వచ్చిన రాంచరణ్ కి ఆ ట్యాగ్ లైన్ నుంచి బయటికి రాలేకపోతున్నాడు. అల్లు అర్జున్ ను పక్కనబెడితే తన తర్వాత వచ్చిన సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లాంటి వాళ్లు ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంటే తాను మాత్రం ఆ రేసులో చాలా వెనుకబడి ఉన్నారు. తని ఒరువన్ లాంటి హిట్ చిత్ర రీమేక్ కోసం దాదాపు ఆరునెలల టైం తీసుకోవటమే ఇందుకు నిదర్శనం.

ఇక చరణ్ సినిమాలకు ఓ ప్రత్యేకత ఉంది. మినిమమ్ 40 కోట్ల కలెక్షన్లు రాబట్టగల సత్తా ఈ మెగా పవర్ స్టార్ సొంతం. బ్రూస్ లీ లాంటి అట్టర్ ఫ్లాప్ సినిమాతో కూడా ఈ ఫీట్ సాధించగలిగాడు. అయితే ఆ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెజ్ ఓ రేంజ్ లో జరిగి గట్టి దెబ్బే తగిలిందనుకోండి. మొత్తం సినిమాలను గనుక గమనిస్తే ఒక్క మగధీర తప్పించి మిగతా ఏ సినిమా కూడా కలెక్షన్లపరంగా సెన్సేషన్ క్రియేట్ చేయలేదు. అదే సమయంలో ఆయా చిత్రాలకు బడ్జెట్ కూడా అంతగా ఖర్చు కాలేదు. కానీ, చెర్రీ అప్ కమింగ్ విషయంలోనే బడ్జెట్ భయం పట్టుకుంది.

సుకుమార్ దర్శకత్వంలో ఫార్ములా ఎక్స్ (టైటిల్ పరిశీలనలో ఉంది) అనే ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మహేష్ తో శ్రీమంతుడు చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీస్ వారు దీనిని రూపొందిస్తున్నారు. దాదాపుగా పూర్తిగా విదేశాల్లో తెరకెక్కించబోయే ఈ చిత్రం బడ్జెట్ దాదాపు 70 కోట్ల పైమాటే అని తెలుస్తోంది. ప్రీ రిలీజ్ ను పక్కనబెట్టి అసలు కలెక్షన్లు రాబట్టే స్టామినా చరణ్ కు ఉందా అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles