తలైవా కోటి కథ తెలుసా... | rajanikanth donate 1 crore for river Integration

Rajanikanth donate 1 crore for river integration

superstar rajanikanth, Linking of Rivers, Rajani river Integration, rajanikanth donate 1 crore, rajanikanth fll fill promise, film news, rajanikanth news, kabali hero donate one crore

superstar rajanikanth donate 1 crore for Linking of Rivers.

తలైవా కోటి కహానీ తెలుసా?

Posted: 06/28/2016 03:13 PM IST
Rajanikanth donate 1 crore for river integration

తాను  నటించిన సినిమాలు ఆర్థిక వ్యవహారాల్లోనే కాదు, ఆపదలో ఉన్న వ్యక్తులకు సైతం తన సొంత జేబులోంచి డబ్బులు పెట్టి ఆదుకుంటుంటాడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఒకానోక టైంలో తలైవా ఆ మంచితనమే ఆయన్ను ఇబ్బందులకు గురిచేస్తుంటుంది కూడా. తాజాగా గతంలో ఆయన ఇచ్చిన ఓ హామీ వ్యవహారంపై రచ్చ అవగా, ఆ కథ సుఖాంతమే అయినట్లు తెలుస్తోంది.

విషయం ఏంటంటే... నదుల అనుసంధానం కోసం స్వచ్ఛందంగా స్పందించిన రజనీ కోటీ రూపాయల విరాళం ఇస్తానని అప్పట్లో ప్రకటించారంట. ఆ సాయం కోసం రైతు సంఘాలు అప్పటి నుంచి కాచుకుని చూస్తున్నాయి. అది కేవలం అది నోటి మాటగానే చెప్పారా అంటూ నిలదీస్తూ ఆయన ఇంటి ఎదురుగా ధర్నా చేసేందుకు వారు సిద్ధమైపోయారు కూడా. అయితే ఆ సాయం రజనీ ఎప్పుడో చేసేశారని సమాచారం.

కబాలి రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆయన సోదరుడు సత్యనారాయణ తంజావురులోని శ్రీ బహదీశ్వరర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ఈ సందర్భంగా మీడియా ఈ విషయమై ఆయన ఆరా తీసింది. స్పందించిన ఆయన ఆ నగదును బ్యాంకు అకౌంట్లో ఎప్పుడో డిపాజిట్ చేసేశాం. ప్రభుత్వం పనులు ప్రారంభించడమే ఆలస్యం. సరైన సమాచారం లేకనే రైతు సంఘాలు నిరసనకు దిగేందుకు సిద్ధమయ్యాయని చెప్పారు. పనిలో పనిగా రజనీ ఆరోగ్య స్థితిపై వస్తున్న రూమర్ల ను కూడా సత్యనారాయణ కొట్టిపారేశాడు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : superstar  rajanikanth  Linking of Rivers  1 crore  

Other Articles