పవన్... రీల్ కాదు రియల్ గాడ్ | Khammam teacher tells how pawan kalyan shows his humanity

Khammam teacher tells how pawan kalyan shows his humanity

pawan kalyan memu saitham, khammam teacher about pawan kalyan, power star shows his humanity, pawan donate to orphanage home, memu saitham about pawan kalyan, pawan kalyan in memu saitham, pawan helping nature, pawan kalyan news, పవన్ కళ్యాణ్ సాయం, ఖమ్మం టీచర్ పవన్ కళ్యాణ్, పవన్ మేము సైతం, మేము సైతంలో పవన్ గురించి, సినిమా వార్తలు, పవన్ సాయగుణం, పవన్ దానగుణం, latest news, వృద్ధాశ్రమం పవన్ కళ్యాణ్

Khammam teacher tells how pawan kalyan shows his humanity in memu saitham.

పవన్... రీల్ కాదు రియల్ గాడ్

Posted: 06/27/2016 02:42 AM IST
Khammam teacher tells how pawan kalyan shows his humanity

సినీ నటుడిగా, ప్రజా సమస్యలపై స్పందించే ఓ నేతగానే కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లో ఓ మంచి మానవతా వాది ఉన్నాడన్న సంగతి అందరికీ తెలిసిందే. నిజ జీవితంలో దేవుడిలా ఆపదలో ఉన్న ఎంతో మందిని ఆదుకున్నాడు. అందుకే ఒక్క ఆయన అభిమానులకే కాదు... యావత్ తెలుగు ప్రజలకు పవన్ అంటే ఓ మంచి గురి ఉంది. ఆ మధ్య సీనియర్ నటి పావలా శ్యామలా దీనస్థితి గురించి తెలిసి ఆలస్యం చేయకుండా తక్షణ సాయం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటి ఉదంతం ఒకటి బయటికి వచ్చింది.

మంచు లక్ష్మీ ప్రతిష్టాత్మక నిర్వహిస్తున్న మేము సైతం కార్యక్రమం గురించి తెలిసిందే. ఓ ప్రముఖ చానెల్ లో ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమం తాజా ఎపిసోడ్ లో ఓ వృద్ధురాలు పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన ఆసక్తికర విషయాలు పవన్ వ్యక్తిత్వాన్ని మరోసారి బయటపెట్టాయి.

ఖమ్మంకు చెందిన లక్ష్మీ అనే టీచర్ తనకొచ్చే తక్కువ జీతంతోనే ఓ వృద్దాశ్రమం నిర్వహించేంది. రిటైర్మెంట్ అయ్యాక నిర్వాహణ కష్టతరం కావటంతో సాయం కోసం ఎదురుచూపులు చూసింది. అంతలో పవన్ లోని సాయగుణం గురించి తెలుసుకున్న ఆమె ఆయన్ను కలిసేందుకు హైదరాబాద్ వచ్చింది. కానీ, పవన్ లాంటి ఓ పెద్ద స్టార్ ని కలవటం అంటే మాములు విషయం కాదు. దీంతో ఆయన ఇంటి ముందు వేచిచూడసాగింది.  అది గమనించిన ఆయన భార్య విషయం పవన్ కి చేరవేసింది. అప్పటికే ఆపీస్ కు బయలుదేరేందుకు పవన్ ఆమెను తన కారులో ఎక్కించుకున్నారు. ఆ హఠాత్ పరిణామానికి బిత్తరపోయిన లక్ష్మీకి నోట మాటరాలేదంట.

ఆమెను తన ఆఫీసుకు తీసుకెళ్లిన పవన్ స్వయంగా కాఫీ కలిపి ఇవ్వటం, ఆపై టిపిన్ పెట్టించడం చేశాడు. ఆశ్రమం గురించి విషయాలు అడిగి తెలుసుకున్న అనంతరం భోజనం చేయాల్సిందిగా ఆమెను కోరాడు. అయితే అనుకోని ఈ అతిథి మర్యాదలతో ఉబ్బితబ్బిబి అయిపోయిన ఆమె వద్దని సున్నితంగా చెప్పిందట. అయిన వినని పవన్ చేపల కూర అప్పటికప్పుడు వండిచ్చి ఆమెతో కలిసి భోజనం చేశాడంట. ఆపై లక్ష రూపాయలు సాయం చేయటంతోపాటు, మరో పదివేలను ఆమె ఖర్చుల కోసం ఇచ్చాడంట. చివర్లో ఇంతమంది అమ్మలను చూసుకుంటున్న మీరూ నాకు అమ్మతో సమానం అనేసరికి కంట్లో నీళ్లు తిరిగాయని ఆమె ఉద్వేగభరిత స్వరంతో చెప్పింది. ఇదంతా జరిగి నాలుగేళ్లు అవుతుందట.

రూపాయి దానం చేసి లక్ష చాటింపులు వేసుకునే ఈరోజుల్లో... తాను చేసే గుప్తాదానాల గురించి ఎక్కడా ప్రస్తావన రాకుండా చూసుకుంటున్నాడు పవన్. ఆయన చేస్తున్న సాయాలు ఇలా ఒక్కోక్కటిగా తెలుస్తుంటే, వెలుగులోకి రానివి ఎంకెన్ని ఉన్నాయో కదా!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  memu saitham  khammam teacher  old age home  

Other Articles