ఎన్టీఆర్ కు స్వీట్ షాక్ ఇచ్చిన ప్రణతి | NTR wife and son in Janatha Garage

Ntr wife and son in janatha garage

NTR wife and son in Janatha Garage, Lakshmi Pranathi gives shocks to NTR, NTR son in Janatha Garage sets, NTR with Abhay Ram, NTR son stills, NTR stills, NTR movies, NTR movie updates, Janatha Garage movie updates, Janatha Garage stills, సినిమాలు, రాజకీయాలు, గరంగరం, క్రీడలు, కామెడీ, Fun, Entertainment, Spicy Videos, Movies, News, Gossips, Sports, Fashion, Style, Comedy, Hotels, Tickets, Hot stills

NTR wife and son in Janatha Garage: Young tiger ntr upcoming film Janatha Garage. koratala siva director. devisriprasad music.

ఎన్టీఆర్ కు స్వీట్ షాక్ ఇచ్చిన ప్రణతి

Posted: 05/10/2016 10:46 AM IST
Ntr wife and son in janatha garage

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో కొత్త హెయిర్ స్టైల్ లుక్ తో కనిపించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ‘కొడుకుకు ప్రేమతో...’ అంటూ తన కొడుకు అభయ్ రామ్ కోసం మళ్లీ సాధారణ లుక్ లోకి వచ్చేసాడు. తన కొడుకుకు ఊహ తెలిసిన క్షణం నుంచి గడ్డంతోనే చూస్తున్నాడని... అతనికి అసలు లుక్ చూపించాలనే ఉద్దేశ్యంతోనే ‘నాన్నకు ప్రేమతో’ సినిమా షూటింగ్ పూర్తవ్వగానే లుక్ మార్చేసినట్లుగా ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.

అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి మరియు కొడుకు అభయ్ రామ్ లు ఎన్టీఆర్ కు స్వీట్ షాక్ ఇచ్చారు.

షూటింగ్ సమయంలో లక్ష్మీ ప్రణతి, అభయ్ రామ్ లు ఎంట్రీ ఇచ్చి ఎన్టీఆర్ కు సడెన్ షాక్ ఇచ్చారు. వీరిద్దరి రాకతో ఎన్టీఆర్ చాలా సంతోషం వ్యక్తం చేసారు. తన కొడుకుతో సరదాగా గడిపాడు ఎన్టీఆర్. షూటింగ్ సమయంలో హీరోయిన్ సమంత కూడా అక్కడే వుండటంతో అభయ్ రామ్ తో సమంత కాసేపు సందడి చేసింది.

ఇలా ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి, అభయ్ రామ్ లను ఒకే దగ్గర(జనతా గ్యారేజ్ సెట్లో) చూడటంతో అక్కడి యూనిట్ అంతా కూడా వీరి సందడికి ముచ్చటపడిపోయారు. ఇక ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Janatha Garage  Abhay Ram  Lakshmi Pranathi  Samantha  

Other Articles