రాశి...నీకు టేస్ట్ వుందంటే? | Rajendra Prasad Vulgar Comments on Heroine

Rajendra prasad vulgar comments on heroine

Rajendra Prasad Vulgar Comments on Heroine, Rajendra Prasad Vulgar Comments Rashi khanna, Rashi khanna hot stills, Rashi khanna in Supreme, Supreme Success Meet, Supreme Collections, రాజకీయాలు, గరంగరం, క్రీడలు, కామెడీ, Fun, Entertainment, Spicy Videos, Movies, News, Gossips, Sports, Fashion, Style, Comedy, Hotels, Tickets, Hot stills

Rajendra Prasad Vulgar Comments on Heroine: Rashi khanna latest hit film Supreme. Saidharam tej hero, anil ravipudi director.

రాశి...నీకు టేస్ట్ వుందంటే?

Posted: 05/09/2016 11:48 AM IST
Rajendra prasad vulgar comments on heroine

సినీ తారలు అప్పుడప్పుడు నోటిదురుసు ప్రదర్శిస్తూ... ఆ తర్వాత ఏదో సరదాగా అనేసాము అంటూ కవరింగ్ చేస్తుంటారు. అలాంటి వారిలో తాజాగా నటుడు రాజేంద్రప్రసాద్ చేరిపోయారు. ఓ సక్సెస్ మీట్ లో హీరోయిన్ పై పలు వ్యాఖ్యలు చేసి, చివర్లో ఇదంతా కేవలం సరదాగా, ఫన్ కోసమే చేసానంటూ కవరింగ్ చేసే ప్రయత్నం చేసాడు. కానీ ఆలోపే రాజేంద్రప్రసాద్ మాటలు జనాలకు బాగా కనెక్ట్ అయ్యారు.

ఆ మాటలన్నీ కూడా సరదాగా అన్నట్లుగా కనిపించలేదు. సాయిధరమ్ తేజ, రాశిఖన్నా జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సుప్రీమ్’ రూపొందిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించింది. ఇందులో హీరోయిన్ రాశిఖన్నా, నటుడు వెన్నెల కిషోర్ ల కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. అయితే ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను ఏర్పాటుచేసారు.

రాశిఖన్నా, వెన్నెల కిషోర్ లు స్టేజ్ పై వుండగా దర్శకుడు అనిల్ రావిపూడి... షూటింగ్ సమయంలో ‘రాశిఖన్నా స్వయంవరం’ అనే పేరుతో జరిగిన ఓ ఫన్నీ మూమెంట్ గురించి చెప్పాడు. అక్కడ వెన్నెల కిషోర్ ను రాశిఖన్నా విజేతగా ప్రకటించినట్లుగా అనిల్ రావిపూడి చెప్పడంతో... రాజేంద్రప్రసాద్ వెంటనే మైక్ అందుకుని రాశిఖన్నాను అసభ్యపదజాలంతో మాట్లాడాడు. ఇక్కడ అసభ్య పదజాలం అంటే ఏదో డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు వంటివి కాదు. కానీ ఒక హీరోయిన్ లేదు ఒక అమ్మాయిని అలా పబ్లిక్ గా అనే మాటలు కాదని ఇక్కడ ఉద్దేశ్యం.

రాశిఖన్నాను ఉద్దేశించి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.... ఇక్కడ ఇంత యంగ్ స్టార్ (రాజేంద్రప్రసాద్)ను పెట్టుకొని, నీ ఎంకమ్మల్లారా... రాశిఖన్నా.. అసలు నీకు టేస్ట్ వుందంటే. ఇంత అందగాడిని ఇక్కడ పెట్టుకొని... పైగా ‘మా’ ప్రెసిడెంటును... నన్ను వదిలేసి వాడికి(వెన్నెల కిషోర్) ప్రపోజ్ చేస్తావా? అసలు వాడికి వున్నదేంటి మహా అయితే ‘వెన్నెల’. అసలు అర్థమవుతుందా లేదా? తెగ నవ్వుతున్నావు? అర్థం హోగయాహై... ? అంటూ మాట్లాడారు. పైగా తనకు రానీ హిందీ భాషలో మాట్లాడి తెగ నవ్వించేసాడు.

కానీ రాజేంద్రప్రసాద్ ఈ కార్యక్రమంలో కాస్త ‘అతి’ చేసాడని అందరూ అనుకుంటున్నారు. ఎంత సీనియర్ నటుడైతే మాత్రం హీరోయిన్లను అలా పబ్లిక్ గా ‘వుందంటే...’ అనే పదజాలం ఉపయోగించడం సరైనది కాదంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. కానీ ఈ మాటలన్నీ కూడా రాశిఖన్నా సరదాగా తీసుకొని నవ్వేసింది. అంతే కదా మరి... మీడియా ముఖంగా ఎన్ని కామెంట్లు చేసినా.. నవ్వుతూనే స్వీకరించాలి కదా!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rashi khanna  Saidharam Tej  Supreme  

Other Articles