కారెక్కిన కాజల్.. కింద మహేష్ | Brahmostavam new poster released

Brahmostavam new poster released

Mahesh Babu, kajal , Brahmostavam, Kajal Agarwal, Brahmostavam Posters, Srikanth Addala, బ్రహ్మోత్సవం, మహేష్, శ్రీకాంత్ అడ్డాల, కాజల్

Mahesh babu's Brahmostavam posters trending tollywood. Brahmostavam team release new poster. In that poster, Mahesh with Kajal Agarwal in a car.

కారెక్కిన కాజల్.. కింద మహేష్

Posted: 05/03/2016 10:29 AM IST
Brahmostavam new poster released

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు అందం అంతకంతకు పెరుగుతోంది. ఆయన తాజాగా చిత్రం బ్రహ్మోత్సవంలో కొత్త లుక్స్ తో అదరగొడుతున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తు్న బ్రహ్మోత్సవం మీద టాలీవుడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే దుమ్మురేపుతున్న ఫస్ట్ లుక్ టీజర్, మధురం మధురం సాంగ్ టీజర్ అదరగొడుతున్నాయి. తాజాగా మరో పోస్టర్ విడుదలైంది. అందులో మహేష్ బాబుతో కాజల్ అగర్వాల్  కనిపిస్తోంది. ఇప్పటి దాకా కనిపించిన పోస్టర్లలో కేవలం సమంత మాత్రమే కనిపించగా, తాజాగా కాజల్ మహేస్ సరసన మెరిసింది.

ఓ కారులో ఎక్కడికో ట్రిప్ కు వెళుతున్నట్లు తాజా పోస్టర్ లో కనిపిస్తోంది. మధ్యలో ఆగి కాస్త రిలాక్స్ అవుతున్నట్లు అనిపించింది. కాజల్ కారులోనే రిలాక్స్ అవుతుండగా.. కారు పక్కన కుర్చీ వేసుకొని మహేష్ కనిపిస్తున్నాడు. మొత్తానికి తాజాగా వచ్చిన పోస్టర్ ఫుల్ కలర్ ఫుల్ గా కనిపిస్తోంది. కాగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను మే27 న విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఆడియోను మే7న శిల్పకళావేదికలో నిర్వహించనున్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles