ఫ్యాన్ చనిపోవడం వల్ల ఆ ఆలోచన లేదట | Shah rukh khan respond on fan sequel

Shah rukh khan respond on fan sequel

Shah rukh khan comments on fan sequel, Fan Movie sequel, Fan Movie collections, Fan Movie, Fan Movie trailers, Fan Movie songs, Fan Movie records, Shah Rukh Khan Fan collections, Fan movie stills

Shah rukh khan respond on fan sequel: Bollywood actor Shah rukh khan latest hit film Fan successfully running. Shah rukh khan comments on fan sequel.

ఫ్యాన్ చనిపోవడం వల్ల ఆ ఆలోచన లేదట

Posted: 04/20/2016 06:28 PM IST
Shah rukh khan respond on fan sequel

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన ‘ఫ్యాన్’ చిత్రం ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఇందులో షారుక్ రెండు పాత్రలో నటించి మెప్పించారు. హీరోగా, ఫ్యాన్(ఆర్యన్)గా అద్భుతంగా నటించారు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ వస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు కానీ షారుక్ మాత్రం ‘ఫ్యాన్’ చిత్రానికి సీక్వెల్ తీయాలని లేదంటున్నాడు.

ఈ విషయంపై షారుక్ మాట్లాడుతూ... ఈ సినిమాలో ఫ్యాన్ చనిపోతాడు. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని అనుకోవడం లేదు. కానీ ‘ఫ్యాన్’ దర్శకుడు మనీష్ శర్మతో పనిచేయాలని భావిస్తున్నాను. అయితే అది ‘ఫ్యాన్’ సినిమా సీక్వెల్ కాదు.. కొత్త కథతో చేస్తానని షారుక్ చెప్పుకొచ్చాడు.

ఇంకా ఫ్యాన్ సినిమా గురించి మాట్లాడుతూ... నేను ఇప్పటికీ ఫీలవుతున్నాను. ‘ఫ్యాన్’ సినిమాలో ఆర్యన్ అనే క్యారెక్టర్తో స్క్రీన్ పై నటించడం చాలా కష్టం. ఒక స్టార్ హీరోగా అది నా జీవితానికి చాలా దగ్గరగా ఉన్న పాత్ర.. సినిమా తారలు సినిమాల్లో కాస్త హుందాగా ఉండాలి. ఎందుకంటే నేను అలాంటి పాత్రల్లోనే చేస్తున్నాను కాబట్టి అని అన్నారు. ఇక మనీష్ దర్శకత్వంలో ఖచ్చితంగా మరో చిత్రం వుంటుంది. వచ్చే ఏడాదిలో దానిపై పనిచేస్తామని షారుక్ చెప్పుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shahrukh khan  Fan  Collections  

Other Articles