Fan Movie | positive talk | Shahrukh Khan | collections | stills

Shahrukh khan fan movie responce good

Fan Movie gets positive talk, Shahrukh Khan Fan public talk, Shahrukh Khan Fan responce, Shahrukh Khan Fan movie review, Shahrukh Khan Fan stills, Shahrukh Khan Fan trailers, Shahrukh Khan Fan success, Shahrukh Khan, Fan

Shahrukh Khan Fan Movie Responce Good: Bollywood star Shahrukh Khan latest film Fan released today and gets positive talk.

‘ఫ్యాన్’తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేసిన షారుక్

Posted: 04/15/2016 04:51 PM IST
Shahrukh khan fan movie responce good

గతకొద్ది రోజులుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తన తాజా చిత్రంతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కేసాడు. షారుక్ ఖాన్ ద్విపాత్రాభినయం చేసిన తాజా చిత్రం ‘ఫ్యాన్’. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, పాటలకు భారీ రెస్పాన్స్ వచ్చింది. భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రం నేడు (ఏప్రిల్ 15) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలయ్యింది.

ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యాక అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అలాంటిది సినిమా విడుదలైన తొలి ఆటకే అన్నిచోట్ల పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీలో వున్నారు. ఇక ఈ సినిమాతో షారుక్ ఖాన్ మళ్లీ రికార్డుల మోత మోగించడం ఖాయమని సినీవర్గాలు అంచనా వేస్తున్నారు.

ఢిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రంలో షారుక్ ఖాన్ ద్విపాత్రాభినయం చేసారు. అభిమానిగా, హీరోగా రెండు పాత్రలలో షారుక్ ఖాన్ అదరగొట్టేసాడు. నటుడిగా ఈ సినిమాలో షారుక్ జీవించేసాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. మరి ఈ సినిమా ఎన్ని కలెక్షన్లను రాబట్టనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shahrukh Khan  Fan  reviews  collections  stills  

Other Articles