Vijay | Polisodu | Trailer | Theri | Audio songs

Polisodu film release date

Polisodu film release date, Vijay Polisodu Teaser, Vijay Polisodu first look poster, Theri Songs, Vijay Theri Posters, Vijay Theri stills, Vijay Theri movie news, Vijay Theri movie updates, Vijay Theri movie details, Vijay Theri shooting details, Vijay Theri

Polisodu film release date: Vijay's latest film Theri. director Atlee, Theri is directed by Atlee and stars Vijay with actresses Samantha and Amy Jackson in lead roles.

విడుదలకు సిద్ధమైన ‘పోలీసోడు’

Posted: 04/11/2016 09:23 AM IST
Polisodu film release date

తమిళంలో ఇళయతలపతి విజయ్ నటించిన ‘థేరి’ చిత్రాన్ని తెలుగులోకి ‘పోలీసోడు’ అనే టైటిల్ తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరియు కలైపులి ఎస్.థాను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర విశేషాలను నిర్మాత దిల్ రాజు, హీరోయిన్ సమంత, దర్శకుడు అట్లీ ఓ సమావేశంలో తెలియజేసారు. ఈ వారమే ‘పోలీసోడు’ భారీగా విడుదల అవుతుంది అని దిల్ రాజు తెలిపారు.

దర్శకుడు అట్లి మీద నాకు మంచి అభిప్రాయం ఉంది. అయన ‘రాజా రాణి’ చిత్రం తీసిన తీరు నాకు బాగా నచ్చింది. ఆ మధ్య చెన్నై వెళ్ళినప్పుడు ఈ కథ విని, కొన్ని సీన్స్ చూసాను. ఈ కథను తప్పకుండా తెలుగు వాళ్ళకి చూపించాలి అనుకున్నాను. సాధారణంగా డబ్బింగ్ సినిమాలు నేను తెలుగులో విడుదల చేయాలంటే అందులో ఏదో స్పెషల్ ఉండాలి. పోలీసోడు చిత్రం అదే కోవకు చెందిన సినిమా అని నిర్మాత దిల్ రాజు అన్నారు.

నేను నటించిన చిత్రం విడుదల అయ్యే ముందు నాకు కొంచెం టెన్షన్ ఉంటుంది. మొదటిసారి ఈ చిత్రం విషయంలో నాకు టెన్షన్ లేదు. అట్లి ఈ సినిమాను అంత బాగా తీసారు. ఇది తెలుగులో కూడా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను అని సమంత తెలిపారు.

‘రాజా రాణి’ సినిమా తెలుగులో బాగా ఆడింది. ఆ తరువాత ఇక్కడ చాలా ఆఫర్ లు వచ్చాయి. కాకపోతే ఒక పెద్ద తమిళ చిత్రం చేసిన తరువాత చేద్దాం అనుకున్నాను. త్వరలో తెలుగులో ఒక పెద్ద సినిమా డైరెక్ట్ చేసే ఉద్దేశం ఉంది. పోలీసోడు చిత్రం తెలుగులో మంచి విజయం సాధిస్తుంది అనుకుంటున్నాను. పిల్లల్ని మంచిగా పెంచటం ఎంత అవసరమో చెప్పే కథ ఇది. ఇది ఒక మంచి ఎమోషనల్ థ్రిల్లర్. విజయ్ ఒక పాత్ర లో ఉన్నాడా లేక డ్యూయల్ రోల్ ఆ అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది అని అట్లి అన్నారు.

విజయ్ , సమంత, అమీ జాక్సన్, ప్రభు, రాధిక, మహేంద్రన్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రం లో ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఈ వారం ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ గా విడుదల అవుతుంది.
దర్శకత్వం - స్క్రీన్ప్లే - అట్లి .ఫోటోగ్రఫీ - జార్జ్ సి విలియమ్స్ . ఎడిటర్ -అన్తోనీ రుబెన్ . సంగీతం - జి . వి . ప్రకాష్ కుమార్. ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ : సతీష్ , సహా నిర్మాతలు - శిరీష్ , లక్ష్మణ్. నిర్మాతలు - రాజు , కలైపులి ఎస్ థాను.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay  Theri  Polisodu  Teaser  audio jukebox  stills  

Other Articles