kamal haasan | Henri Langlois | Tweets | Awards | Movie News

Kamal haasan gets henri langlois

kamal haasan received Henri Langlois, kamal haasan gets Henri Langlois, kamal haasan awards, kamal haasan movie news, kamal haasan latest updates, kamal haasan tweets, kamal haasan stills

kamal haasan gets Henri Langlois: Universal star kamal haasan get Henri Langlois award in paris.

కమల్ కు ‘హెన్రీ లాంగ్లోయిస్’ పురస్కారం

Posted: 04/01/2016 09:45 AM IST
Kamal haasan gets henri langlois

తమిళ అగ్రనటుడు, ఉలగనయగన్ కమల్ హాసన్ ఖాతాలో మరో అవార్డు వచ్చిచేరింది. యూనివర్సల్ స్టార్ హీరోగా పేరు దక్కించుకున్న కమల్ నటనకు ఇప్పటికే అవార్డులు, రివార్డులతో పాటుగా ప్రశంసలు అందుకున్నారు. తాజాగా మరో ప్రతిష్టాత్మక అవార్డును ఆయనను వరించింది.

ఫ్రాన్స్‌కి చెందిన ప్రసిద్ధ ఫిల్మ్ ఆర్కైవిస్ట్ ‘హెన్రీ లాంగ్లోయిస్’ పేరు మీద ‘యునెస్కో’కు చెందిన ఫ్రెంచ్ నేషనల్ కమిషన్ వారు అందించే ఈ అవార్డు కమల్‌ను వరించింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి అందించిన సేవలకుగాను కమల్ కు ఈ అవార్డును ప్రధానం చేసారు. ఫ్రాన్స్‌లో చలన చిత్రాలను భద్రపరిచే ప్రకియ చేపట్టిన ఘనత హెన్రీ లాంగ్లోయిస్‌ది. ‘ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్’, ‘సినిమాథెక్యూ ఫ్రాంకైస్’లకు ఆయన కో-ఫౌండర్.

అలాంటి పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు కమల్ హాసన్. ఈ సంధర్భంగా కమల్ తన సోషల్ మీడియా ద్వారా తన సంతోషాన్ని పంచుకున్నారు. ‘‘ప్యారిస్‌లో అవార్డు తీసుకున్నా. దీన్ని కళ్లారా చూడడానికి నా గురువు అనంతు సార్ బతికి ఉంటే బాగుండేది. ఆయన ద్వారానే హెన్రీ లాంగ్లోయిస్ గొప్పతనం తెలుసుకున్నా’’ అని కమల్ ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kamal haasan  Henri Langlois  Tweets  Awards  stills  

Other Articles