Vijay | Theri | Audio songs | Trailer

Theri official trailer

Theri Official Trailer, Vijay Theri Audio launch, Vijay Theri Audio Release Date, Vijay Theri Trailer, Theri Teaser, Vijay Theri Posters, Vijay Theri stills, Vijay Theri movie news, Vijay Theri movie updates, Vijay Theri movie details, Vijay Theri shooting details, Vijay Theri

Theri Official Trailer : Vijay's latest film Theri. director Atlee, Theri is directed by Atlee and stars Vijay with actresses Samantha and Amy Jackson in lead roles.

అంచనాలు పెంచేసిన ‘థేరి’ ట్రైలర్

Posted: 03/20/2016 08:57 PM IST
Theri official trailer

ఒకపక్క తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో విడుదల సందడితో మారుమ్రోగుతుంటే... మరోవైపు తమిళంలో ఇళయథలపతి విజయ్ ‘థేరి’ ఆడియో విడుదల కార్యక్రమంతో దుమ్మురేపుతోంది. ఇప్పటికే విడుదలైన ‘థేరి’ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఒక్క టీజర్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.

‘రాజా రాణి’ వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కలైపులి ఎస్.థాను సమర్పణలో వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్.థాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన పాటలు నేడు గ్రాండ్ గా విడుదలయ్యాయి.

తాజాగా ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ ట్రైలర్ చూస్తుంటే మళ్లీ విజయ్ ‘థేరి’తో రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని తెలుస్తోంది. జోసెఫ్ మరియు విజయ్ కుమార్ అనే రెండు పాత్రలలో విజయ్ నటిస్తున్నాడు. మరి ఈ రెండు పాత్రలు ఒకరివేనా.. లేక ఇద్దరు కూడా వేరు వేరు వ్యక్తులా అనేది అర్థం కావడంలేదు. విజయ్ సరసన అమీజాక్సన్, సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay  Theri  Trailer  audio jukebox  stills  

Other Articles