Sardaar Gabbar Singh | Title Song | Teaser | Pawan Kalyan | Audio Release Date

Pawan kalyan sardaar title song

Sardaar Gabbarsingh Title Song, Sardaar Gabbarsingh Teaser, Pawan Kalyan Sardaar Gabbarsingh Making Video, Sardaar Gabbar Singh shooting stills, Sardaar Gabbar Singh overseas rights sold out, Sardaar Gabbar Singh Audio Release Date, Sardaar Gabbar Singh Teaser Pawan kalyan Sardaar Gabbar singh Bike, Sardaar Gabbar singh Movie news, Sardaar Gabbar singh stills, Pawan kalyan movie news, Pawan kalyan movie updates, Pawan kalyan stills, Sanjana, Raai Laxmi, Kajal agarwal

Pawan kalyan Sardaar Title Song: Power star pawan kalyan latest film Sardaar Gabbar singh. bobby director, devi sri prasad music. kajal heroine. Pawan kalyan movie shooting updates and details.

నిరాశపరిచిన ‘సర్దార్’ టైటిల్ సాంగ్

Posted: 03/17/2016 03:25 PM IST
Pawan kalyan sardaar title song

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సౌత్ ఇండియన్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ల కాంబినేషన్లో సినిమా వస్తుందంటే... ఆ సినిమా ఖచ్చితంగా మ్యూజికల్ హిట్టవ్వాల్సిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘జల్సా’, ‘గబ్బర్ సింగ్’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు మ్యూజికల్ హిట్స్ గా, రికార్డులు క్రియేట్ చేసాయి. అలాంటి హ్యట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’.

‘జల్సా’, ‘గబ్బర్ సింగ్’, ‘అత్తారింటికి దారేది’ సినిమాలలోని టైటిల్ సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడమే కాకుండా.. ఇప్పటికీ మారుమ్రోగుతున్నాయి. అలాంటిది ‘సర్దార్ గబ్బర్ సింగ్’ టైటిల్ సాంగ్ మాత్రం చాలా నిరాశపరిచింది. తాజాగా ‘సర్దార్’ టైటిల్ సాంగ్ ట్రాక్ ను విడుదల చేసారు. ఈ ట్రాక్ వింటుంటే కొంచెం కూడా కొత్తదనం లేకపోగా పూర్తిగా నిరాశపరిచేసింది. ‘గబ్బర్ సింగ్’ టైటిల్ సాంగ్ కు ముందర ‘సర్దార్’ అనే పదాన్ని జతచేసి రిలీజ్ చేసినట్లుగా అనిపిస్తుంది.

సాంగ్ కోసం క్లిక్ చేయండి... Sardaar GabbarSingh

నిజానికి ‘జల్సా’, ‘గబ్బర్ సింగ్’, ‘అత్తారింటికి దారేది’ సినిమాల పాటలు దుమ్మురేపాయి. కానీ ‘సర్దార్’ టైటిల్ ట్రాక్ సాంగ్ వింటుంటే... ఈ సినిమా ఆడియోపై కాస్త అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. మరి ఈ ఆడియోలో పాటలన్నీ ఇదే విధంగా వుంటాయో.. లేక దుమ్మురేపే విధంగా వుంటాయో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.

హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘పవర్’ ఫేం బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై శరత్ మరార్, సునీల్ లుల్లాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఆడియోను ఈనెల 20న నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో, గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

ఇందులో పవన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. రాయ్ లక్ష్మీ, సంజనలు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles