Pawan Kalyan | Sardaar Gabbar Singh | Making Video | Audio Release Date | Teaser

Sardaar gabbarsingh making video

Pawan Kalyan Sardaar Gabbarsingh Making Video, Sardaar Gabbar Singh shooting stills, Sardaar Gabbar Singh overseas rights sold out, Sardaar Gabbar Singh Audio Release Date, Sardaar Gabbar Singh Teaser Pawan kalyan Sardaar Gabbar singh Bike, Sardaar Gabbar singh Movie news, Sardaar Gabbar singh stills, Pawan kalyan movie news, Pawan kalyan movie updates, Pawan kalyan stills, Sanjana, Raai Laxmi, Kajal agarwal

Sardaar Gabbarsingh Making Video: Power star pawan kalyan latest film Sardaar Gabbar singh. bobby director, devi sri prasad music. kajal heroine. Pawan kalyan movie shooting updates and details.

దుమ్మురేపుతున్న ‘సర్దార్’ మేకింగ్ వీడియో రెస్పాన్స్ అదుర్స్

Posted: 03/14/2016 10:59 AM IST
Sardaar gabbarsingh making video

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హంగామా మళ్లీ మొదలయ్యింది. రెండు వీడియోలు ఒకేసారి అభిమానులపై ఎటాక్ చేయడంతో భారీ సందడి నెలకొంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒకేసారి రెండు పండగలు వచ్చినట్లుగా అయ్యింది. ఒకటి పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ, మరొకటి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వీడియో.

తాజాగా పవన్ కళ్యాణ్ తో బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్, జర్నలిస్ట్ అనుపమ చోప్రా జరిపిన ఇంటర్వ్యూ వీడియోలు గత శనివారం విడుదలైన విషయం తెలిసిందే. ఆ వీడియోలు యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఈ ఇంటర్వ్యూకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో పవన్ కళ్యాణ్ చాలా ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఇదిలా వుంటే రెండు రోజుల క్రితం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్ర మేకింగ్ వీడియోను విడుదల చేసారు. ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో టాప్ స్థానంలో సందడి చేస్తోంది. ట్రైలర్ రేంజులో ఈ మేకింగ్ వీడియో వుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీలో వున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ మరోసారి తనదైన మార్క్ స్టైల్ తో అదరగొట్టబోతున్నారు.

హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘పవర్’ ఫేం బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై శరత్ మరార్, సునీల్ లుల్లాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. రాయ్ లక్ష్మీ, సంజనలు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

విడుదల తేది దగ్గరపడుతుండటంతో షూటింగ్ తో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేసారు. సౌత్ ఇండియన్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఆడియోను ఈనెల 20న గ్రాండ్ గా విడుదల చేసి, ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Making Video  Sardaar Gabbar Singh  shooting stills  Audio Release Date  posters  

Other Articles