Sardaar Gabbar Singh | stills | Audio Release Date | Pawan Kalyan | Teaser

Pawan kalyan breaks baahubali record

Pawan Kalyan Breaks Baahubali Record, Sardaar Gabbar Singh Breaks Baahubali Record, Sardaar Gabbar Singh shooting stills, Sardaar Gabbar Singh Audio Release Date, Sardaar Gabbar Singh Teaser Pawan kalyan Sardaar Gabbar singh Bike, Sardaar Gabbar singh Movie news, Sardaar Gabbar singh stills, Pawan kalyan movie news, Pawan kalyan movie updates, Pawan kalyan stills, Sanjana, Raai Laxmi, Kajal agarwal

Pawan Kalyan Breaks Baahubali Record: Power star pawan kalyan latest film Sardaar Gabbar singh. bobby director, devi sri prasad music. kajal heroine. Pawan kalyan movie shooting updates and details.

‘సర్దార్’తో కొత్త రికార్డ్ సెట్ చేసిన ‘గబ్బర్ సింగ్’

Posted: 03/12/2016 03:35 PM IST
Pawan kalyan breaks baahubali record

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమాలో ‘నేను ట్రెండ్ ను ఫాలో అవ్వను... ట్రెండ్ సెట్ చేస్తాను’ అని చెప్పినట్లుగా మరో కొత్త ట్రెండ్ ను సెట్ చేసాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విడుదలకు ముందే బిజినెస్ పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది.

ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ట్రైలర్లు, పాటలు విడుదలకాక ముందే ‘సర్దార్ గబ్బర్ సింగ్’పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు 90కోట్లకు పైగా చేసి షాక్ ఇవ్వగా.. తాజాగా ‘బాహుబలి’ ఆడియో రికార్డును కూడా బద్దలుకొట్టేసింది. ‘బాహుబలి’ ఆడియో రిలీజ్ టెలికాస్ట్ హక్కులను ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కోటి రూపాయలకు కొనుగోలు చేసి, అప్పట్లో ఓ రికార్డును క్రియేట్ చేసింది.

ఆ రికార్డును ‘సర్దార్ గబ్బర్ సింగ్’ బద్దలుకొట్టేసినట్లుగా తెలిసింది. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో రిలీజ్ టెలికాస్ట్ హక్కులను మాటివి ఛానెల్ దాదాపు 1.25 కోట్లకు దక్కించుకున్నట్లుగా సమాచారం. దీంతో ‘బాహుబలి’ రికార్డును ‘సర్దార్ గబ్బర్ సింగ్’ అధిగమించాడనే చెప్పుకోవచ్చు. ఈ సినిమా విడుదలకు ముందు నుంచే బిజినెస్ ఈ రేంజులో అవుతుండటంతో అటు చిత్ర యూనిట్, ఇటు అభిమానులు సంతోషంగా వున్నారు.

‘పవర్’ ఫేం బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై శరత్ మరార్, సునీల్ లుల్లాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ పురాతన భవనంలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. విడుదల తేది దగ్గరపడుతుండటంతో షూటింగ్ తో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేసారు.

మార్చి 19న నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో వేడుక జరగనుందని తెలుస్తోంది. సౌత్ ఇండియన్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర ఆడియో విడుదల కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే రాయ్ లక్ష్మీ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించేసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Record Breaks  Sardaar Gabbar Singh  Audio Release Date  posters  

Other Articles