Allu Arjun | Sarainodu | Audio Rights | Teaser | Rakul preet singh

Sarrainodu audio rights sold out

Allu Arjun Sarrainodu Audio Rights Sold out, Allu Arjun Sarrainodu Teaser Records, Sarainodu Teaser, Allu Arjun Sarainodu movie stills, Allu Arjun latest news, Allu Arjun movie updates, Allu Arjun movie details, Allu Arjun

Sarrainodu Audio Rights Sold out: Stylish star allu arjun Sarainodu movie teaser release on 18 feb. boyapati srinu director, Rakul preet singh heroine. Thaman Music.

‘సరైనోడు’ని దక్కించుకున్న లహరి

Posted: 02/26/2016 03:20 PM IST
Sarrainodu audio rights sold out

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా కమర్షియల్ మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘సరైనోడు’. పూర్తి స్థాయి ఊర మాస్ హీరోగా అల్లు అర్జున్‌ పాత్రను బోయపాటి శ్రీను డిజైన్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవలే విడుదలైన టీజర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

‘సరైనోడు’ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర ఆడియో హక్కులను భారీ రేటుకు అమ్మేయడం విశేషం. ‘బాహుబలి’, ‘కృష్ణగాడి వీరప్రేమగాధ’ వంటి హిట్ చిత్రాల ఆడియోను అందించిన లహరి మ్యూజిక్ సంస్థ ‘సరైనోడు’ ఆడియో హక్కులను సొంతం చేసుకుంది. భారీ మొత్తంలో చెల్లించి, ఆడియో రైట్స్ ను సొంతం చేసుకుందని తెలుస్తోంది.

టీజర్ విడుదలకే ఇలాంటి బిజినెస్ వుందంటే.. ఇక ట్రైలర్, పాటలు విడుదలయితే బిజినెస్ ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు. థమన్ సంగీతం అందిస్తున్న ‘సరైనోడు’ పాటలు మార్చి నెలలో విడుదల కానున్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. బన్నీ సరసన రకూల్ ప్రీత్ సింగ్, కెథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Sarainodu  Audio Rights  Teaser  Rakul preet singh  

Other Articles