పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ తాజాగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన రూ.5 కోట్ల ‘రతన్‌పూర్’ భారీ సెట్లో శరవేగంగా జరుపుకుంటోంది. గతంలో ఘనవిజయం సాధించిన ‘గబ్బర్‌సింగ్’ పాత్రనే పవన్ మళ్ళీ రిపీట్ చేస్తున్న కారణంగా ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే.. ఈ మూవీ రైట్స్ ఊహించని రేంజులో అమ్ముడుపోతున్నాయి.
ఇప్పటికే ఈ మూవీ వరల్డ్‌వైడ్ రైట్స్‌ని ‘ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ’వారు రికార్డ్ స్థాయిలో రూ.72 కోట్లు సమర్పించి కొనుగోలు చేసింది. ఇక టాలీవుడ్లో ఈ మూవీకి వున్న క్రేజ్‌ని బట్టి ఆ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో భారీ రేటుకు అమ్మినట్లు సమాచారం. అందులో భాగంగానే.. ‘సర్దార్’ సీడెడ్ రైట్స్ రూ.10.7 కోట్లకి అమ్ముడుపోగా.. తాజాగా అందిన మరో రిపోర్ట్ ప్రకారం వైజాగ్ రైట్స్ రూ.7.2 కోట్లకి అమ్ముడుపోయినట్లు తెలిసింది. వైజాగ్‌లో ఓ మూవీ రైట్స్ ఇంత భారీ రేంజులో అమ్ముడుపోవడం ఇదే మొదటిసారి. ఈ సినిమాకి ఉన్న క్రేజ్ వల్ల ఈ అమౌంట్‌ని క్రాస్ చేసేలా కలెక్షన్స్ ఉంటాయనే నమ్మకంతోనే డిస్ట్రిబ్యూటర్స్ ఈ రేటుకు కొన్నట్లు చెబుతున్నారు. ఇక ఓవర్సీస్ రైట్స్ కూడా రూ.10 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
రిలీజ్‌కి ముందే ఈ మూవీ రికార్డ్ స్థాయిలో చేస్తున్న బిజినెస్‌ని చూస్తుంటే.. విడుదలైన తర్వాత బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. కాగా.. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకూ కేరళలో షూటింగ్ చేయనున్నారు. ఇందులో పవన్ సరసన కాజల్ హీరోయిన్గా నటిస్తుండగా.. లక్ష్మీ రాయ్, సంజనలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more