Ishq Junoon | Motion Poster | First Look Poster | Stills

Ishq junoon the heat is on motion poster

Ishq Junoon Motion Poster, Ishq Junoon Poster, Ishq Junoon First Look, Ishq Junoon Video, Ishq Junoon Hot stills, Ishq Junoon stills, Ishq Junoon cast

Ishq Junoon The Heat Is On Motion Poster: Produced by Anuj Sharma along with Vinay Gupta. 'Ishq Junoon - The Heat Is On', is a film by Sanjay Sharma starring Rajbeer Singh, Divya Singh and Akshay Rangshahi.

మరో బూతు పోస్టర్ రిలీజ్... అందాలిచ్చి ఎంజాయ్ చేస్తున్న భామ

Posted: 01/30/2016 03:28 PM IST
Ishq junoon the heat is on motion poster

ఈమధ్య బాలీవుడ్ లో బూతు సినిమాల హవా బాగా ఎక్కువైన విషయం తెలిసిందే. మొన్నటి వరకు సన్నీలియోన్ వల్లనే బాలీవుడ్ లో బూతు సినిమాల హవా పెరుగుతుందని అనుకుంటే... ఇపుడు సన్నీలియోన్ ను మించిన భామలు, దర్శకులు వున్నారు. అందుకు నిదర్శనమే తాజాగా విడుదలైన ‘ఇష్క్ జనూన్’ ఫస్ట్ లుక్

తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ‘త్రీసమ్ లవ్’ అనే కొత్త కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. అంటే ముగ్గురు కలిసి ప్రేమించుకోవడం. కేవలం ప్రేమించుకోవడమే కాదు.. ఇంకా చాలా చేసుకోవచ్చు అనేది ఈ కాన్సెప్టు. పైగా ఈ సినిమాకు ‘ది హీట్ ఈజ్ ఆన్’ అనే క్యాప్షన్ కూడా పెట్టేసారు.

కాన్సెప్టు, ట్యాగ్ లైన్ పక్కనపెట్టేస్తే... తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ హాట్ టాపిక్ గా మారింది. ఓ భామ ఎద అందాలపై ఇద్దరు యువకులు చేతులు పెట్టిన ఓ పోస్టర్ ను విడుదల చేసారు. కానీ ఆ నటీనటులు ఎవరనేది పోస్టర్లో చూపించలేదు. పోస్టర్ ఇలా వుందంటే.. ట్రైలర్ ఎలా వుంటుందో ఏమో.

రాజ్ బీర్ సింగ్, దివ్యా సింగ్, అక్షయ్ రంగ్‌షాహి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని వినయ్ గుప్తా, అంజు శర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంజయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సోను నిగమ్, జీత్ గంగూలీ, అంకిత్ తివారీ, అంజన్ భట్టాచార్య సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ishq Junoon  Motion Poster  Posters  Stills  

Other Articles