Allu Arjun | Sarainodu | First look posters | stills

Allu arjun sarainodu movie first look

Allu Arjun Sarainodu first look, Sarainodu Pre Look Poster, Allu Arjun Sarainodu movie stills, Allu Arjun latest news, Allu Arjun movie updates, Allu Arjun movie details, Allu Arjun

Allu Arjun Sarainodu Movie First Look: Stylish star allu arjun Sarainodu movie first look poster released. boyapati srinu director, Rakul preet singh heroine. Thaman Music.

అదరగొట్టిన ‘సరైనోడు’ ఫస్ట్ లుక్

Posted: 01/25/2016 06:16 PM IST
Allu arjun sarainodu movie first look

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా... సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో... సూపర్ డూపర్ హిట్స్ ని అందించిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్లో... విజయవంతమైన చిత్రాలకు కేరాఆఫ్ అడ్రస్ గా నిలిచిన అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం సరైనోడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ ను ఇటీవలే రిలీజ్ చేశారు.

విభిన్నమైన ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన ఈ ప్రీ లుక్ పోస్టర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ప్రీ లుక్ పోస్టర్స్ తో తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు.. అల్లు అర్జున్ అభిమానుల్లో ప్రత్యేకమైన క్రేజ్ నెలకొంది. కండలు తిరిగిన చేతితో... హ్యాండిల్ తో కూడిన ఇనుప గుండును పట్టుకున్న ఈ పోస్టర్ తో అభిమానులు పండగ చేసుకున్నారు. ఇదే క్రేజ్ ను కంటిన్యూ చేస్తూ... సరైనోడు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్ కు అద్భుతమైన స్పందన లభించింది. అల్లు అర్జున్ స్టామినాను, బోయపాటి శ్రీను లాంటి మాస్ డైరెక్టర్ టేకింగ్ ను మిళితం చేసి రూపొందిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమా రేంజ్ భారీగా పెరిగిందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్, కేథరీన్ అందచందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అంజలి ఓ ప్రత్యేకగీతంలో అల్లు అర్జున్ తో కలిసి స్టెప్పులేసింది. ఏప్రిల్ 8న స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్బంగా విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు.

ఈ సందర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ.... సరికొత్త ప్రమోషన్ లో భాగంగా సరైనోడు చిత్రానికి సంబంధించి ఇటీవలే ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశాం. ఈ పోస్టర్ చూసిన తర్వాత ఇండస్ట్రీ వర్గాల నుంచి.. అభిమానుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అసలు సిసలు ఫస్ట్ లుక్ పోస్టర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా... అని ఎదురుచూశారు. ఈ ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ... సరైనోడు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేశాం. భారీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా సరైనోడు చిత్రాన్ని నిర్మిస్తున్నాం. అల్లు అర్జున్ ని సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్నాడు బోయపాటి శ్రీను. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే హై ఓల్డేజ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. రకుల్, కేథరీన్ గ్లామర్, తమన్ సంగీతం, రిషి పంజాబి ఛాయాగ్రహణం ప్రత్యేక ఆకర్షణ. అల్లు అర్జున్, అంజలి కాంబినేషన్లో వచ్చే ప్రత్యేక గీతం సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. అని అన్నారు.

నటీనటులు.... అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, కేథరీన్ థెస్రా, శ్రీకాంత్, ఆది పినిశెట్టి, సాయి కుమార్, బ్రహ్మానందం, జయప్రకాష్, జయప్రకాష్ రెడ్డి, సురేఖా వాణి, విద్యుల్లేఖ, దేవ దర్శిని, అంజలి (ప్రత్యేక పాటలో)

సాంకేతిక వర్గం.... బ్యానర్ - గీతా ఆర్ట్స్; ప్రొడక్షన్ కంట్రోలర్స్ - బాబు, యోగానంద్; చీఫ్ కోఆర్డినేటర్ - కుర్రా రంగారావ్; ఆర్ట్ డైరెక్టర్ - సాయి సురేష్; ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్; ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వర రావ్; ఫైట్ మాస్టర్స్ - రామ్ లక్ష్మణ్, రవి వర్మ; డిఓపి - రిషి పంజాబి; డైలాగ్స్ - ఎం.రత్నం; మ్యూజిక్ - ఎస్ ఎస్ తమన్; కో ప్రొడ్యూసర్ - శానం నాగ అశోక్ కుమార్; ప్రొడ్యూసర్ - అల్లు అరవింద్; డైరెక్టర్ - బోయపాటి శ్రీను.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Sarainodu  first look  Rakul preet singh  

Other Articles