I was bullied for my looks in school: Kate Winslet

Kate winslet gives inspiring body image message to girls

kate winslet, kate winslet films, kate winslet works, Steve Jobs, Oscar, Academy Awards, selfie, entertainment news

Kate Winslet says it is important for her to convey to girls that celebrities do not look pretty all the time.

శరీర అకృతిపై హాలీవుడ్ నటి సందేశం..

Posted: 01/01/2016 03:05 PM IST
Kate winslet gives inspiring body image message to girls

టైటానిక్ భామ కేట్ విన్‌స్లెట్ అమ్మాయిలకు ఓ బ్రహ్మాండమైన సత్యం చెప్పింది. మెరిసే కళ్లతో,  అద్భుతమైన అందంతో అందరినీ ఆకట్టుకున్న ఈ భామ యువతులకు ఆసక్తికరమైన సందేశాన్నిస్తోంది. వెండితెర మీద, అవార్డు ఫంక్షన్లలోను కళ్లు చెదిరే అందంతో అందరినీ ఆకట్టుకునే తమలాంటి సెలబ్రిటీలు.. ఎప్పుడూ అంత అందంగా ఉంటారన్న భ్రమలు పెట్టుకోవద్దని తెలిపింది. అవార్డు ఫంక్షన్లలోనూ, రెడ్ కార్పెట్ మీద అడుగులు వేసేటపుడు ఉన్న అందం.. అన్నివేళలా ఉండదని పేర్కొంది. వృత్తి నిర్వహణలో భాగంగా తాము అలా మెరవక తప్పదని,  మిగతా సమయంలో అందరిలాగే సాధారణంగానే ఉంటామని తెలిపింది.

ఈ విషయాన్ని యువతులు గ్రహించాలని సూచించింది. ఈ విషయాన్ని ఈ తరం యువతులకు చెప్పడం చాలా ముఖ్యమైందిగా తాను భావిస్తున్నానంది. టైటానిక్  మూవీలో రోజ్‌గా అందరి మదిలో నిలిచిపోయిన ఈ భామ  మరో విషయాన్నికూడా తన అభిమానులతో పంచుకుంది. తాను చిన్నపుడు  చాలా బొద్దుగా ఉండేదాన్నిని, అందరూ తనను చూసి ఆట పట్టించేవారని తెలిపింది. హీరోయిన్ అయ్యే సమయానికి బరువు తగ్గించుకుని నాజూగ్గా తయారైనట్లు చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kate Winslet  inspiring  body  message  girls  

Other Articles