MM Keeravaani Tribute to SP Balu on Completing 50 Years

Mm keeravaani tribute to sp balu on completing 50 years

MM Keeravaani Tribute to SP Balasubrahmanyam, MM Keeravaani Tribute to SPB, MM Keeravaani Tribute to Balu, MM Keeravaani Tribute Song, MM Keeravaani Tribute Song for Balu, SP Balasubrahmanyam on Completing 50 Years, SP Balasubrahmanyam 50 Years journey, SP Balasubrahmanyam, MM Keeravaani Tribute song

MM Keeravaani Tribute to SP Balu on Completing 50 Years

స్పెషల్ సాంగ్: బాలుకు అంకితమిచ్చిన కీరవాణి

Posted: 12/15/2015 03:27 PM IST
Mm keeravaani tribute to sp balu on completing 50 years

ప్రముఖ తెలుగు నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు అయినటువంటి పద్మశ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సినీరంగంలోకి గాయకుడిగా ఎంట్రీ ఇచ్చి 50ఏళ్లు పూర్తి చేసుకున్నారు. అభిమానులంతా ఈయనను ‘బాలు’ అని ముద్దుగా పిలుస్తుంటారు. వయసు పెరిగినా కూడా ఈయన గొంతుకు మాత్రం వయసు రాకుండా, ఇప్పటి యువ హీరోలకు సైతం పాటలు పాడి అలరిస్తున్నారు.

1946 జూన్ 4వ కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయమైన శైవ బ్రాహ్మణ కుటుంబంలో బాలు జన్మించాడు. చిన్నతనం నుంచే బాలుకు పాటలు పాడటం ఒక అలవాటుగా మారింది. 1966లో ప్రముఖ నటుడు, నిర్మాత అయినటువంటి పద్మనాభం నిర్మించిన ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ చిత్రం ద్వారా సినీగాయకునిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు బాలు. ఈ సినిమాకు ఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకత్వం వహించారు.

తనకు గాయకుడిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై వున్న గౌరవంతో బాలు నిర్మించిన ఆడియో ల్యాబ్ కు ‘కోదండపాణి ఆడియో ల్యాబ్స్’ అనే పేరు పెట్టారు. ఇక అక్కడి నుంచి బాలు పాటలు ఆగలేవు. ఎన్నో సినిమాల్లోని పాటలు, ఎంతో మంది సంగీత దర్శకులు... ఎందరో స్టార్, అగ్ర హీరోలకు బాలు పాటలు పాడారు. బాలు పాడిన పాటలన్నీ కూడా దాదాపు మంచి విజయం సాధించనవే. కేవలం పాటలు పాడటమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా తనదైన ముద్రను వేసుకున్నారు బాలు.

అయితే బాలు సినీ ఇండస్ట్రీలోకి గాయకుడిగా అరంగేట్రం చేసి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సంధర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఓ పాటను బాలసుబ్రహ్మణ్యంకు అంకితం చేసారు. కీరవాణి స్వయంగా రాసి, పాడిన ఈ పాటను తాజాగా విడుదల చేసారు. ఈ పాటను కీరవాణి మరియు సాహితి కలిసి పాడారు. ‘వేల్ రికార్డ్స్’ ద్వారా ఈ పాటను విడుదల చేసారు. ఆ పాట మీకోసం అందిస్తున్నాం. మీరు విని ఆనందించండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : MM Keeravaani  Tribute song  SP Balasubrahmanyam  50 Years  stills  

Other Articles