అందరిలోనూ తమకంటూ ఓ ప్రత్యేక ప్రతిభ వుంటుంది.. దానిని నిరూపించుకునే సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చేసి చూపిస్తారు.. చూపిస్తూనే వుంటారు. అలా చేయడం వారికి సరదానివ్వడంతోపాటు సంతోషాన్ని కలిగిస్తుంది. ఆ ప్రతిభతో ఇతరులను కూడా వారు మెప్పిస్తారు. కానీ.. గోవాబ్యూటీ ఇలియానాకు మాత్రం అలా చేయడం ఏమాత్రం ఇష్టం లేదంటోంది. తాను వుండేది ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అయినప్పటికీ.. 24 గంటలూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం తనవల్ల కాదని స్పష్టం చేస్తోంది. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ఎంత న్యాయం చేయాలో కెమెరా ముందు చేస్తానని అంటున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత ఇతరుల ఎంటర్‌టైన్‌మెంట్ గురించి అస్సలు ఆలోచించనంటూ వెల్లడిస్తోంది. కెమెరా వెనకాల వున్నప్పుడు కేవలం తన గురించి మాత్రమే ఆలోచిస్తానని, ఇతర విషయాలపై దృష్టి సారించనంటూ చెబుతోంది. అంతేకాదు.. ఈ భామ తనకు సంబంధించిన ఇష్టాయిష్టాల్ని ఏమాత్రం బెడియం లేకుండా బట్టబయలు చేసేసింది. ఆ విషయాలు ఆమె మాటల్లోనే..
‘ఈ ప్రపంచంలో ఎంత బెస్ట్ పర్సన్ అయినా, అందర్నీ మెప్పించలేరు. ఎక్కడో చోట ఎవరో ఒకర్ని నిరుత్సాహపరుస్తారు. నేనూ అంతే! నేను హీరోయిన్‌ని కాబట్టి ఇరవైనాలుగు గంటలూ ఎంటర్‌టైన్ చేయాలనుకుంటే నా వల్ల కాదు. అందర్నీ మెప్పించడానికి ట్రై చేయను. ఎవరైనా నన్ను అపార్థం చేసుకుంటే నేనేం చేయలేను. యాక్చువల్‌గా ఫొటోగ్రాఫర్స్ కనిపించగానే మొహం మీద చిరునవ్వు పులుముకుని పోజులిచ్చే టైప్ కాదు నేను. కెరీర్ ఆరంభించిన మొదట్లో చాలా ఇబ్బందిపడ్డాను. ఆ తర్వాత తర్వాత వృత్తిలో ఇది కూడా భాగమే అని సర్ది చెప్పుకున్నా. అప్పట్నుంచీ ఫొటోలకు పోజులివ్వడం పెద్ద ఇబ్బందిగా అనిపించడంలేదు. ఇక నా వ్యక్తిగత విషయాలు చెప్పడానికి ఇష్టపడను. అన్ని విషయాలూ చెప్పేస్తే ఇంకేముంటుంది? అందుకే కొన్నయినా దాచుకుంటా. ఒకరి కోసం నా వ్యక్తిత్వాన్ని మార్చుకోను. నాకెలా ఉండాలనిపిస్తే అలా ఉంటాను. అలా ఉండటం తప్పు అని ఎవరైనా అంటే కేర్ చేయను. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హద్దులు దాటడానికి ప్రయత్నిస్తారు. ఎక్కువగా చొరవ తీసుకోవాలనుకుంటారు. అలాంటివాళ్లకు వీలైనంత దూరంగా ఉంటాను’ అంటూ అమ్మడు తన అభిప్రాయాల్ని వెల్లడించింది.
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more