Finally VV Vinayak Is Confirmed As Director To Chiranjeevi 150 Movie | Chiru 150 Movie Kaththi Remake | Kaththi Telugu Remake

Chiranjeevi 150 movie confirmed director vv vinayak tamil kaththi remake

chiru 150 movie confirmed, vv vinayak news, chiru 150 film news, chiru 150 movie, chiru vinayak 150 movie, kaththi remake news, kaththi remake movie, chiru kaththi remake movie, chiranjeevi kaththi remake news, chiranjeevi kaththi news

Chiranjeevi 150 Movie Confirmed Director VV Vinayak Tamil Kaththi Remake : After A Long Time Finally VV Vinayak Is Confirmed As Director To Chiranjeevi 150 Movie. They Are Gonig To Remake Kaththi Movie Which Is Blockbuster Hit In Kollywood.

చిరు 150వ మూవీకి వినాయక్ ఫిక్స్.. ‘కత్తి’ని పదను చేయనున్నారట!

Posted: 10/01/2015 05:02 PM IST
Chiranjeevi 150 movie confirmed director vv vinayak tamil kaththi remake

మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చేసింది. ఇన్నాళ్లు వాయిదాల మీద వాయిదా పడుతూ వచ్చిన చిరు 150వ చిత్రానికి సంబంధించి చివరికి ఓ క్లారిటీ వచ్చింది. చిరు 150వ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహించనున్నాడు. తమిళంలో భారీ విజయం సాధించడంతోపాటు బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లు కలెక్ట్ చేసిన ‘కత్తి’ సినిమానే రీమేక్ చేస్తున్నట్టు సమాచారం. సామాజిక అంశాలతో కూడిన కథాంశంతో తెరకెక్కిన ఆ చిత్రం.. తమిళంలో అన్నివర్గాల ప్రజల్ని ఆకర్షించింది. విమర్శకులు సైతం ఆ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ సినిమాతోనే చిరు రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఆలోచించినట్లు తెలిసింది. ఈ విషయంపై త్వరలోనే మెగా ఫ్యామిలీ సన్నిహితులు అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్ జోరుగా సాగుతున్న ఈ సినిమాని నవంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లే పనిలో యూనిట్ నిమగ్నమైంది.

నిజానికి చిరు 150వ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తాడని ఇన్నాళ్లూ ప్రచారం కొనసాగింది. ఆమధ్య స్వయంగా చిరు తన 150వ చిత్రానికి పూరీయే దర్శకత్వం వహిస్తాడని ప్రకటించారు కూడా! అలాగే ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్న రామ్ చరణ్ కూడా పలు ఇంటర్వ్యూలలో పూరీయే చిరుకి 150వ చిత్రానికి దర్శకుడని చెప్పాడు. పూరీ మాంచి పవర్ఫుల్ కథని రెడీ చేస్తున్నాడని, త్వరలోనే ప్రొడక్షన్ కార్యక్రమాలు సిద్ధం చేస్తామని కూడా తెలిపాడు. కానీ.. చిరు తన బర్త్ డే సందర్భంగా 150వ చిత్రంపై కుండబద్ధలు కొట్టేశారు. తన మూవీపై ఇంకా ఫైనల్ నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఇంతలోనే పూరీ కూడా తన బర్త్ డే సందర్భాన్ని పురస్కరించుకుని చిరుపై సంచలన కామెంట్లు చేశాడు. తాను చెప్పిన స్టోరీలో మొదటి భాగం చిరుకి నచ్చిందని, రెండో భాగం నచ్చలేదని తెలిపాడు. దీంతో తాను తీవ్ర అసంతృప్తికి గురయ్యాయని పూరీ అసహనం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలోనే అతనిని తొలగంచేసి వివి వినాయక్ ని దర్శకుడిగా తీసుకున్నట్లు తెలుస్తోంది. పైగా.. గతంలో చిరుకి వినాయక్ ‘ఠాగూర్’ రూపంలో భారీ విజయాన్ని అందించిన విషయం తెలిసిందే! ఆ నమ్మకంతోనే తన కంబ్యాక్ చిత్రానికి వినాయక్ కు దర్శకత్వ బాధ్యతల్ని అప్పగించినట్లు చెప్పుకుంటున్నారు.

దాదాపు 8 ఏళ్ల తర్వాత పూర్తిస్తాయి హీరోగా చిరు రీఎంట్రీ ఇవ్వనున్న ఈ సినిమా కోసం వివి వినాయక్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలిసింది. ‘కత్తి’ కథను తనదైన స్టైల్లో పదును చేసే ప్రయత్నాల్లో వివినాయక్ నిమగ్నమయ్యాడట. ప్రస్తుతం ‘అఖిల్’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో ఫుల్ బిజీగా వున్న వినాయక్.. ఆ వర్క్ పైర్తయిన వెంటనే ‘చిరు 150’వ చిత్రంపై దృష్టి సారించనున్నాడు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్లు కథలో కొద్దిగా మార్పులు చేసి, మరిన్ని సామాజిక, కమర్షియల్ ఎలిమెంట్లు చేర్చే అవకాశం వుందని చెబుతున్నారు. ఏదేమైనా.. ఇంతకాలం తర్వాత చిరు 150వ చిత్రానికి సంబంధించి కన్ఫర్మ్ వార్త రావడంతో మెగాభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారని చెప్పుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chiru 150 movie confirmed  kaththi remake  vv vinayak  

Other Articles