i wont agree to act in fairness cream ads says tamanna

Tamanna not to advertise for fairness cream advertisements

tamanna, fairness cream adds, color is not important, charecter is important, south indian actress tamanna, tamanna not to advertise for fairness cream advts, tamanna latest news, tamannalatest movies, tamanna new photos, tamanna hot photos, tamanna gallary

south indian actress tamanna not to advertise for fairness cream advertisements, even if crores of ruppees given to her

కోట్ల రూపాయలు ఇచ్చినా అందులో మాత్రం నటించను

Posted: 09/20/2015 10:23 PM IST
Tamanna not to advertise for fairness cream advertisements

దీపం వుండానే ఇల్లు చక్కబెట్ట్టుకోవాలన్న చందాన  క్రేజ్ ఉన్నప్పుడే కాస్తో, కూస్తో కూడబెటు్టకుని పధిలపర్చుకోవాలని అందరూ నటీనటులు అన్ని రకాలుగా తమ ప్రతిభను కనబర్చి సోమ్ము చేసుకుంటుంటే.. సౌత్ ఇండియన్ నటి, మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం ఆ విషయంలో మడికట్టుకు కూర్చుంది. ఏమైనా అంటే తనకు కోట్ల రూపాయలు ఇచ్చినా.. అందులో మాత్రం నటించనని నిర్మోఖమాటంగా చెప్పేస్తుంది. ఇంతకీ ఏందులో.. అనుకుంటున్నారా..? అయితే మీరు పూర్తిగా చదవాల్సిందే..

తమ మాటకు ప్రజల్లో ముఖ్యంగా ప్రేక్షకులలో ప్రాధాన్యత వున్నప్పుడు మాత్రమే పటీనటులకు డిమాండ్. అలా కాదని డిమాండ్ పడిపోయాక ఏం చేసేందుకైనా సిద్దం అన్నా పట్టించుకునే నాధుడే వుండదు. అదే ప్రకటనకర్తలు మాత్రం ఈ విషయంలో మరింత జాగ్రత్త వహిస్తారు. జనాల్లోకి తమ ఉత్పత్తిని తీసుకెళ్లడం కోసం ఉత్పత్తిదారులు సెలబ్రిటీలతో నాలుగు మంచి మాటలు చెప్పిస్తారు. ఈ మాటలు చెప్పడానికి సెలబ్రిటీలు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటారు. స్టార్ హీరోయిన్ తమన్నా కూడా అలా భారీ పారితోషికం తీసుకుని, చేస్తున్న వాణిజ్య ప్రకటనలు చాలానే ఉన్నాయి. కానీ, ఈ మిల్కీ బ్యూటీ ఎన్ని కోట్లిచ్చినా ఒకే ఒక్క యాడ్‌లో మాత్రం నటించరట.

గతంలో అలాంటి యాడ్‌లో నటించిన తమన్నా ఇప్పుడు మాత్రం మనసు మార్చుకున్నారు. దాని గురించి ఆమె చెబుతూ - ‘‘సినిమాల్లోకి రాకముందు నేను మోడల్‌గా చేసేదాన్ని. ఆ సమయంలో ఓ ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్‌లో నటించాను. కానీ, ఇప్పుడు నేను హీరోయిన్‌ని. ఓ సెలబ్రిటీగా సమాజం పట్ల నాకు బాధ్యత ఉంది. అందుకే, శరీర రంగుకి సంబంధించిన ఉత్పత్తులకు మోడల్‌గా చేయకూడదని నిర్ణయించుకున్నాను. మన ఇండియాలో రంగుకి ప్రాధాన్యం ఇస్తారు. అది మంచిది కాదు. ఎందుకంటే, రంగు అనేది మన చేతుల్లో ఉండదు. కానీ, ప్రవర్తన మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. అందుకే, శారీరకంగా తెల్లగా ఉండాలనుకోకుండా మానసికంగా తెల్లని కాగితంలా ఉండాలంటాను’’ అన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles