The First Look Teaser Of Nagarjuna Latest Flick Soggade Chinni Nayana Has Released | Ramya Krishna | Lavanya Tripathi

Akkineni nagarjuna soggade chinni nayana first look teaser released

soggade chinni nayana movie updates, nagarjuna latest movie, nagarjuna soggade chinni nayana, soggade chinni nayana teaser, nagarjuna with ramya krishna, nagarjuna with lavanya tripathi

Akkineni Nagarjuna Soggade Chinni Nayana First Look Teaser Released : The First Look Teaser Of Nagarjuna Latest Flick Soggade Chinni Nayana Has Released In The Occassion Of His Birthday.

సోగ్గాడే చిన్ని నాయన టీజర్ రిలీజ్

Posted: 08/29/2015 11:38 AM IST
Akkineni nagarjuna soggade chinni nayana first look teaser released

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున చాలాకాలం గ్యాప్ తర్వాత నటిస్తున్న తాజా చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయన’. ఈ చిత్రంలో నాగార్జున ద్విపాత్రాభినయంలో నటిస్తుండగా.. అతని సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో చివరి షెడ్యూల్ తో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, మరికొన్ని ఫోటోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా నాగార్జున బర్త్ డే సందర్భంగా ఆ మూవీ టీజర్ ని విడుదల చేశారు. చాలా సింపుల్ గా వున్న ఈ టీజర్ కు మంచి కామెంట్లే వచ్చిపడుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. సోషియో ఫాంటసీ తరహాలో ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రం రూపొందనుంది.

ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తవ్వడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రాధామోహన్ కథ, స్ర్కీన్ ప్లేను అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : soggade chinni nayana  akkineni nagarjuna  lavanya tripathi  ramya krishna  

Other Articles