Rakul Preet Singh Is Busy With Continues Telugu Movie Schedules | Tollywood Star Heroes

Rakul preet singh busy continues telugu movie schedules

Rakul Preet Singh, Rakul Preet Singh movies, Rakul Preet Singh ram charan, Rakul Preet Singh junior ntr, Rakul Preet Singh sukumar, Rakul Preet Singh allu arjun, allu arjun boyapati movie, ram charan srinu vaitla movie

Rakul Preet Singh Busy Continues Telugu Movie Schedules : Young Actress Rakul Preet Singh Is Busy With Continues Telugu Movie Schedules.

వరుస షెడ్యూళ్లతో రకుల్ బిజీబిజీ

Posted: 08/04/2015 07:05 PM IST
Rakul preet singh busy continues telugu movie schedules

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ ఎవరంటే ముందుగా వినిపించే హీరోయిన్ పేరు రకుల్ ప్రీత్ సింగ్. అవును.. యువతారల హవా జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో సీనియర్ స్టార్ హీరోయిన్లకు ఆఫర్లు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. పైగా.. సీనియర్-యువ హీరోలందరూ కొత్త హీరోయిన్లనే తమ సినిమాల్లో తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తుండటంతో సీనియర్ తారలు అరకొర ఆఫర్లతోనే సర్దిపెట్టుకుంటున్నారు.

ఇక యంగ్ హీరోయిన్ల విషయానికొస్తే.. వీరిమధ్య పోటీ గట్టిగానే వున్నప్పటికీ.. రకుల్ ప్రీత్ మాత్రం తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకోవడంతోపాటు సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమా విజయంతో తెలుగులో పాగా వేసిన ఈ అమ్మడు.. అతి కొద్దికాలంలోనే వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఇలా వరుసగా టాప్ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడిపేస్తోంది. గత కొద్దిరోజుల క్రితమే రామ్ చరణ్ -శ్రీను వైట్ల సినిమాకు సంబంధించిన షెడ్యూల్‌ను పూర్తి చేసిన రకుల్... రీసెంట్‌గా ఎన్టీఆర్-సుకుమార్‌ల సినిమా షూటింగ్‌కు షిఫ్ట్ అయింది. యూకేలో భారీ ఎత్తున జరుగుతున్న ఈ షెడ్యూల్‌కు సంబంధించి రకుల్ తన పార్ట్‌ను కొంతమేర ఇంతకుముందే పూర్తి చేసింది. మిగిలిన షూటింగ్ కోసం మళ్ళీ యూకేలో ల్యాండ్ అయ్యింది. అక్కడ జరుగుతోన్న ఈ షెడ్యూల్‌లో రెండు వారాలపాటు ఆమె షూటింగ్ లో వరుసగా పాల్గొననుంది.

ఆ తర్వాత వెంటనే మళ్ళీ చెర్రీ సినిమా షూటింగ్‌కు షిఫ్ట్ అవ్వాలి. ఇలా రెండు సినిమాలతో ఒకేసారి రెండు షెడ్యూల్స్‌ను చూసుకుంటూ ఈ అమ్మడు ఫుల్ బిజీగా గడపుతోంది. అంతేకాదు.. అల్లు అర్జున్, భోయపాటి శ్రీనుల సినిమా కూడా ఈ మధ్యే సెట్స్‌పైకి వెళ్ళింది. దీంతో త్వరలోనే ఆ సినిమా షూటింగ్‌కు కూడా రకుల్ సిద్ధం కావాల్సి ఉంది. అంటే.. ప్రస్తుతం రకుల్ వరుసగా మూడు సినిమాలతో బిజీగా వుంటూ.. ఖాళీ లేకుండా గడుపుతోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rakul Preet Singh  telugu star heroes  

Other Articles