Prabhas Fans Angry | Baahubali | Theaters

Prabhas fans angry on baahubali theaters

Baahubali Fans Angry on Theaters, Baahubali Fans Angry, Baahubali movie news, Baahubali movie updates, Baahubali latest news, Baahubali stills, Baahubali online booking, Baahubali tickets, Baahubali booking, Baahubali shows, Baahubali updates, Baahubali details, Baahubali posters, Baahubali trailers, Baahubali benefit shows, Baahubali theaters list, Baahubali shows details, Baahubali

Prabhas Fans Angry on Baahubali Theaters: Prabhas latest film baahubali. baahubali film release on 10 july. SS Rajamouli Direction. Prabhas, Rana, Tamannah, Anushka, Ramya krishna acts in lead roles.

బాహుబలి కోసం ఫ్యాన్స్ థియేటర్ల అద్దాలు ధ్వంసం

Posted: 07/09/2015 01:23 PM IST
Prabhas fans angry on baahubali theaters

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ‘బాహుబలి’ సినిమా కోసం అద్దాలు బద్దలుకొట్టేస్తున్నారు. అన్ని థియేటర్లలో ‘బాహుబలి’ సినిమా పడాల్సిందే అంటూ అభిమానులు ఆందోళన చేస్తున్నారు. విశాఖపట్నంలోని దొండపర్తిలో ‘బాహుబలి’ చిత్రం కోసం అభిమానులు ఆందోళన చేపట్టారు. అక్కడ శ్రీకన్య థియేటర్ లో ‘బాహుబలి’ చిత్రం ప్రదర్శించడం లేదని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఇంతటి భారీ చిత్రాన్ని థియేటర్ లో ఎందుకు ప్రదర్శించడం లేదంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో థియేటర్ అద్దాలను బద్ధలుకొట్టేసారు. వెంటనే థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు అందజేసారు. మొత్తానికి ‘బాహుబలి’ సినిమా ప్రదర్శించడం లేదని అభిమానులు తీవ్ర నిరాశలోనే కాకుండా ఆగ్రహానికి గురవుతున్నారని తెలుస్తోంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ చిత్రం ఈనెల 10వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషలలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు. ఆర్కా మీడియా సంస్థ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  Fans Angry  Theatres list  Trailers  

Other Articles