Rana talks about Bahubali movie story line

Rana talks about bahubali movie story line

Rana talks about Bahubali story line, Baahubali hindi premiere show date, Baahubali hindi premiere show, Baahubali premiere show, Baahubali movie latest news, Baahubali posters, Baahubali movie updates, Baahubali movie details, Baahubali stills, Baahubali songs, Baahubali trailers, Prabhas, Karan Johar, Bollywood News

Rana talks about Bahubali movie story line: Daggubati Rana upcoming film baahubali. SS Rajamouli Direction, mm keeravani music. Prabhas, rana, anushka, tamanna acts in lead roles. this movie will be release on 10 july.

బాహుబలి స్టోరీ లైన్ ఇంతేనంటున్న భల్లాలదేవ

Posted: 06/19/2015 11:45 AM IST
Rana talks about bahubali movie story line

‘బాహుబలి’ సినిమా కథ లీకైందంటూ గతకొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ‘బాహుబలి’ సినిమా ఎలా వుండబోతుందా అని అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు కానీ సినీ ఇండస్ట్రీలో ‘బాహుబలి’ కథ ఇదేనంటూ చక్కర్లు కొడుతోంది అదేంటంటే...

మహిష్మతి రాజ్యనికి అధిపతి అయిన అమరేంద్ర బాహుబలి(ప్రభాస్) ఆయన భార్య దేవసేన(అనుష్క). వీరి పాలనలో ప్రజలు సుఖశాంతులతో కాలం గడుపుతూ ఉంటారు. అయితే స్వార్ద పరుడైన మంత్రి బిజ్జలదేవ(నాజర్) బాహుబలి సోదరుడు భల్లలదేవ(రానా)తో చేతులు కలిపి అమరేంద్ర బాహుబలిని యుద్దంలో చంపి రాజ్యాన్ని తమ ఆధీననంలోకి తెచ్చుకుంటారు. రాజ్యం తమ అధీనంలోకి వచ్చినాక తన విగ్రహాన్ని ప్రతిష్టించుకునాడు భల్లలదేవ. అంతే కాదు ప్రజలను తన బానిసలుగా చూస్తాడు.

పసివాడైన బాహుబలి కుమారుడుని కూడా చంపడానికి ప్రయత్నిస్తాడు భల్లలదేవ అయితే దేవసేన తన కుమారుడిని కాపాడి రాజ్యం దాటిస్తుంది. అయితే భల్లలదేవ సైన్యం దేవసేనను బందించి చెరసాల పాలు చేస్తారు. ఈ నేపద్యంలో చిన్న బాహుబలిని కొందరు గ్రామస్తులు కాపాడతారు. అంతేకాకుండా పెంచి పెద్దచేసి అతనికి శివుడు(ప్రభాస్) అని పేరు పెడతారు.

శివుడు కూడా తండ్రి తన తండ్రి పోలికలతొనే ఉంటూ అందర్ని తన ధైర్య సాహసాలతో ఆకర్షిస్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితులలో తన ప్రాంతానికి రాజకుమారి అవంతిక(తమన్నా) వస్తుంది. ఆమె అందం చందం చూసి శివుడు తనని ప్రేమిస్తాడు. అయితే ఆ తర్వాత అవంతిక తన రాజ్యానికి వెళ్లిపోతుంది. అవంతికను వెతుక్కుంటూ శివుడు మహిష్మతి రాజ్యానికి వెళ్తాడు. అక్కడ శివుడు తన గతం గురించి తెలుసుకుంటాడు. క్రూరుడైన భల్లలదేవ పై ప్రతీకారం తీర్చుకొని రాజ్యాన్ని, ప్రజలను, తన తల్లిని ఎలా సొంతం చేసుకొన్నాడు అనేదే "బాహుబలి" చిత్ర కధ. అంటూ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.

ఇదంతా చాలా రోజుల నుంచి నడుస్తున్న కథ అయినప్పటికీ.. ఈ కథకు కాస్త బలాన్నిచ్చే విధంగా రానా తాజాగా ఓ ఇంటర్వ్యూలో కామెంట్ చేసాడు. తాజాగా బాలీవుడ్ లో ‘బాహుబలి’ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న రానా.. అక్కడ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘బాహుబలి’ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే రాజ్యం కోసం ఇద్దరు అన్నాదమ్ముల మధ్య జరిగే పోరాటమే బాహుబలి సినిమా అని చెప్పుకొచ్చాడు.

కానీ నిజానికి ట్రైలర్ లో చూస్తుంటే ‘బాహుబలి’ కూడా చనిపోయినట్లుగా అనిపించడం లేదు. బాహుబలి మరియు దేవసేనలను చివరకు శివుడు చెరసాల నుంచి కాపాడుకుంటాడేమో అని అనిపిస్తోంది. ఒకవేళ రానా చెప్పినట్లుగా ఇది ఇద్దరు అన్నదమ్ముల కథ అయితే... బాహుబలికి భల్లలదేవా తమ్ముడు అవుతాడు. అంటే శివుడు చిన్నాన్న అవుతాడు. అంటే ఇది అన్నదమ్ముల పోరాటంతో పాటు బాబాయ్ అబ్బాయ్ పోరాటం అని కూడా అనుకోవచ్చా?

ఇలా ఆలోచించుకుంటూపోతే చాలా ప్రశ్నలు తలెత్తుతాయి. అందుకే ఈ ప్రశ్నలు అన్ని పక్కనపెట్టి ‘బాహుబలి’ని వెండితెర మీద చూసి ఎంజాయ్ చేయడమే బెటర్. ఇలాంటి ప్రతిష్టాత్మక చిత్రాలకు కూడా మరీ ఇలా ప్రశ్నలేసుకుంటూపోతే సమయం వృధా తప్ప ఇంకేం వుండదు. సో... జస్ట్ వెయిట్ ఫర్ జూలై 10 బాహుబలి రిలీజ్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  premiere show date  Prabhas  Karan Johar  Bollywood News  

Other Articles