Controversial Director Ram gopal varma praises bahubali the begining movie trailer | rajamouli | twitter

Ram gopal varma praises bahubali the begining movie trailer rajamouli

ram gopal varma, bahubali trailer, rajamouli, prabhas, tollywood, hollywood movies, bahubali updates, prabhas, anushka shetty

Ram gopal varma praises bahubali the begining movie trailer rajamouli : This time Controversial Director Ram gopal varma has create sensation by doing positive tweets on bahubali the begining movie trailer. He also praises director rajamouli for making these type of movie and helping indian film industry to grow up like hollywood.

వర్మకి ఏమైంది.. ‘బాహుబలి’ ట్రైలర్ పై ఇలా ట్వీట్స్ చేశాడు!

Posted: 06/02/2015 03:46 PM IST
Ram gopal varma praises bahubali the begining movie trailer rajamouli

రాంగోపాల్ వర్మ.. ట్విటర్ వేదికగా సంచలనాలను సృష్టించే వివాదాస్పద దర్శకుడు! సినీపరిశ్రమ నుంచి పొలిటికల్ రంగానికి చెందిన ప్రముఖులను సైతం.. తన మాటల మంత్రాన్ని ప్రదర్శిస్తాడు. ఈయన చేసే ట్వీట్స్.. సదరు వ్యక్తులను ఉద్దేశిస్తూ విమర్శిస్తున్నాడా? పొగుడుతున్నాడా? అని ఎవ్వరికీ అంతుచిక్కదు. ఈ మధ్యకాలంలో ఈయన మిడ్ నైట్ చేసే ట్వీట్స్ ఈ విధంగానే అర్థం కాకుండా వుంటున్నాయి. చాలా సందర్భాల్లో ప్రతి విషయంపైనా విమర్శలు గుప్పించే వర్మం.. ఈసారి మాత్రం ‘బాహుబలి’ ట్రైలర్ పై ఆశ్చర్యకరమైన ట్వీట్లు చేశాడు.

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి- ది బిగినింగ్’ మూవీకి సంబంధించి జూన్ 1న ట్రైలర్ విడుదలయ్యింది. ఈ ట్రైలర్ కి దేశవ్యాప్తంగా భారీ రెస్పాన్స్ వచ్చింది. ప్రముఖులు సైతం ఈ ట్రైలర్ పై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. ఇండియన్ ఇండస్ట్రీని మరో స్థాయికి తీసుకెళ్లే విధంగా ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తున్నారని అభిప్రాయం వెల్లడించారు. ఇక సంచలన దర్శకుడు సైతం ఈ తరహాలోనే ట్రైలర్ పై పాజిటివ్ గా ట్వీట్స్ చేశాడు. సినిమాలపై నిత్యం విమర్శలు గుప్పించే వర్మ.. ఈసారి అందుకు భిన్నంగా ‘బాహుబలి-ట్రైలర్’ పై ప్రశంసలు కురిపించడం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగింది.

varma-bahubali-tweets

‘బాహుబలి’ ట్రైలర్ ను వీక్షించిన అనంతరం వర్మ ట్వీట్ చేస్తూ.. ‘ఇంటర్నేషనల్ స్కేలు ప్రకారం బాహుబలికి 100కు 70 మార్కులు.. ఇండియన్ స్కేలు ప్రకారం 100కు 500 మార్కులు’ వేశాడు. ఇండియన్ సినిమాను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెలుతున్నందుకు రాజమైళికి థాంక్స్ అని కూడా చెప్పాడు. అంతేకాదు.. ‘బాహుబలి సినిమాకు ఎంత ఖర్చయింది? పెట్టుబడి తిరిగొస్తుందా? లేదా? అనేది పాయింటు కాదు. ఇండియన్ సినిమాకు ఇది తాజ్ మహల్ లాంటిది. దశబ్దాల పాటు నిలిచిపోయే సినిమా’అని అన్నాడు. అనంతరం ‘ఎపిక్ సినిమాల్లో బాహుబలి న్యూ చాప్టర్ లాంటిది’ అంటూ పొగిడేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram gopal varma  bahubali  twitter  rajamouli  

Other Articles