Big B amitabh bachchan wants to romance with young actresses | deepika padukone | vidya balan | alia bhatt | kangana ranaut

Amitabh bachchan romance deepika padukone vidya balan alia bhatt kangana ranaut

amitabh bachchan, amitabh bachchan updates, amitabh bachchan interview, amitabh bachchan hot comments, deepika padukone, vidya balan, alia bhatt, kangana ranaut, bollywood actresses

amitabh bachchan romance deepika padukone vidya balan alia bhatt kangana ranaut : Bollywood big b expressed his feelings that he wants to romance with young actresses.

ఆ యువతారలతో రొమాన్స్ చేయాలనుందట!

Posted: 06/01/2015 10:47 AM IST
Amitabh bachchan romance deepika padukone vidya balan alia bhatt kangana ranaut

బాలీవుడ్ బిగ్ బీ.. ఏడు పదుల వయస్సులోనూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. మరోవైపు యాడ్స్ చేయడం, కొన్ని బ్రాండ్ లకు అంబాసిడర్ గా వ్యవహరించడంతోపాటు టెలివిజన్ ప్రోగ్రామ్ లలో సైతం నటిస్తున్నారు. ఈ విధంగా నిత్యం బిజీగా గడుపుతున్న అమితాబ్ కి ఒక్క అసంతృప్తి మిగిలిపోయిందని తన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతకాలంలో హాట్ హీరోయిన్లుగా బాలీవుడ్ స్ర్కీన్స్ మీద వెలిగిపోతున్న యువతారలతో తనకు రొమాన్స్ చేయాలని వుందని.. కానీ ఈ వయస్సులో ఆ అవకాశం లేకపోవడం చాలా అసంతృప్తిగా వుందని ఆయన వెల్లడించాడు. ఆ యువతారలు మరెవ్వరో కాదు.. విద్యాబాలన్, దీపికా పదుకొనె, కంగనా రనౌత్, ఆలియా భట్!

ఆ నలుగురు తారలు ప్రస్తుతం బాలీవుడ్ తెరపై తమ అందాలను ఆరబోయడంతోపాటు సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు. ముఖ్యంగా బికినీ, లిప్ లాక్, బెడ్ రూమ్ రొమాంటిక్ సన్నివేశాల్లో ఆ తారలందరూ పూర్తిగా లీనమైపోయి నటించేస్తున్నారు. పైగా.. వరుస విజయాలతో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. ఇటువంటి అందమైన భామలతో హీరోగా నటించే వయసులో లేకపోవడం తనకి చాలా బాధగా వుందని అమితాబ్ పేర్కొన్నారు. అంతేకాదు.. వాళ్లతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తున్న హీరోలను చూస్తే అసూయగా ఉందని బిగ్ బి సరదాగా అన్నారు. మరి.. బిగ్ బీ వెల్లడించిన ఈ అభిప్రాయంపై ఆ ఘాటు భామలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amitabh bachchan  deepika padukone  vidya balan  

Other Articles