Varun tej latest look | Kanche Latest news

Varun tej new look in kanche film

Varun tej latest look in Kanche film, Varun tej Kanche movie news, Krish Kanche Movie news, Kanche Movie news, Kanche Movie updates, Kanche Movie shooting, Kanche Movie details, Kanche Movie heroine, Kanche Movie stills, Varun Kanche

Varun tej new look in Kanche film: Varun tej upcoming film kanche Krish Director. Rajeev reddy producer. Pragya jaiswal heroine.

కంచె సినిమాలో వరుణ్ ఇలాగే వుంటాడా?

Posted: 05/28/2015 04:40 PM IST
Varun tej new look in kanche film

‘ముకుంద’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగాహీరో వరుణ్ తేజ... ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో ఈసారి ఎలాగైనా హిట్టుకొట్టాలనే కసితో వున్నాడు వరుణ్. ప్రస్తుతం వరుణ్ తేజ నటిస్తున్న రెండవ చిత్రం ‘కంచె’.

‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’ వంటి విభిన్న చిత్రాల దర్శకుడు జాగర్లమూరి రాధాకృష్ణ(క్రిష్) దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం కోసం ఓ భారీ సెట్ ను ఏర్పాటు చేసారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ స్పాట్ ఫోటోలను విడుదల చేసారు.

వరుణ్ తేజ్ సరసన ప్రగ్య జైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా మొత్తం 1940 టైంలో అనగా స్వాతంత్ర్యం రాక ముందునాటి కాలంలో జరుగుతుందని తెలిసింది. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ సమయంలో తీసిన ఓ ఫోటో ఇంటర్నెట్ లో తెగ హల్చల్ చేస్తోంది. ఆ ఫోటోను మీరు ఓ లుక్కేయండి.

‘ముకుంద’ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో నటించిన వరుణ్ తేజ... ఈ ‘కంచె’ సినిమాలో మరీ సన్నగా కనిపిస్తున్నాడు. మరి ఈ సినిమాలో వరుణ్ ఎలా వుండబోతున్నాడో త్వరలోనే తెలియనుంది.  ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మాత రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Varun tej  latest look  Kanche  Latest news  

Other Articles