Sudeep Aslaam Khan | First Look poster | Bahubali

Sudeep aslaam khan first look in bahubali

Sudeep Aslaam Khan‬ First Look, Sudeep as Aslaam Khan‬, Sudeep latest stills, Sudeep posters, Baahubali new posters, Baahubali new look, Baahubali movie news, Baahubali movie updates, Baahubali movie news, Baahubali movie stills, Baahubali movie latest stills, Baahubali movie latest updates, Baahubali, Prabhas, Sudeep

Sudeep Aslaam Khan First Look in Bahubali: Kannada actor kiccha Sudeep Upcoming telugu movie Bahubali. Sudeep as Aslaam Khan‬ in baahubali. Director SS Rajamouli. Prabhas, anushka, rana, tamanna acts in lead roles.

అస్లాంఖాన్ గెటప్ లో ఈగ విలన్.. బాహుబలి కోరిక మేరకు ఎంట్రీ!

Posted: 05/16/2015 04:39 PM IST
Sudeep aslaam khan first look in bahubali

‘ఈగ’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్... మరోసారి రాజమౌళి సినిమాలో నటించాడు. ‘బాహుబలి’ సినిమాలో ఓ కీలక పాత్రలో రాజమౌళి కోరిక మేరకు సుదీప్ నటించాడట. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళియే ప్రకటించాడు.

‘బాహుబలి’ సినిమాకు సంబంధించిన నటీనటుల ఫస్ట్ లుక్ పోస్టర్లు రోజుకోకటి చొప్పున గతకొద్ది రోజులుగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో భాగంగా నేడు(మే 16) ఈ సినిమాలోని అస్లాంఖాన్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ అస్లాంఖాన్ పాత్రలో సుదీప్ నటించాడు. తను అడగగానే అస్లాంఖాన్ గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలో నటించడానికి ఒప్పుకున్నాడు సుదీప్.. థ్యాంక్స్ అంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు.

వరుసగా ఈనెల చివర వరకు ఇలాగే ‘బాహుబలి’లో నటించిన ప్రధాన నటీనటుల ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేయనున్నారు. అలాగే మే 31న థియేటర్ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. జులై 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా బ్యానర్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. యం.యం.కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్ర ఆడియో విడుదల తేదిని అధికారికంగా ప్రకటించనున్నారు.

Bahubali Sudeep Aslaam Khan First Look Poster-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sudeep  Aslaam Khan?  First Look poster  Bahubali  

Other Articles