Satya Raj Kattappa | First Look Released

Satya raj kattappa first look released

Satya Raj Kattappa‬ First Look, Satya Raj as Kattappa‬, Satya Raj latest stills, Satya Raj posters, Baahubali new posters, Baahubali new look, Baahubali movie news, Baahubali movie updates, Baahubali movie news, Baahubali movie stills, Baahubali movie latest stills, Baahubali movie latest updates, Baahubali, Prabhas, Satya Raj

Satya Raj Kattappa First Look Released: Actor Satya Raj latest Upcoming movie Bahubali. Satya Raj as Kattappa‬ in baahubali. Director SS Rajamouli. Prabhas, anushka, rana, tamanna acts in lead roles.

సైనికుడిగా కొండంత అండగా సత్యరాజ్ కట్టప్ప లుక్ కిరాక్

Posted: 05/15/2015 04:37 PM IST
Satya raj kattappa first look released

‘మిర్చి’ సినిమాలో ప్రభాస్ తండ్రిగా నటించిన నటుడు సత్యరాజ్ మీకు గుర్తున్నాడా? ఆయన తెలుగు, తమిళ, హిందీ భాషలలోని పలు చిత్రాలలో నటించారు. సత్యరాజ్ తెలుగులో నటిస్తున్న తాజా చిత్రం ‘బాహుబలి’. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి’ చిత్రంలోని ‘కట్టప్ప’ పాత్రలో సత్యరాజ్ నటిస్తున్నారు.

ఈ కట్టప్ప పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా విడుదల చేసారు. ఈ లుక్ చూస్తుంటే యుద్ధానికి సిద్ధంగా వున్న సైనికుడిలా వున్నాడు. ‘బాహుబలి’లో భారీ యుద్ద సన్నీవేశాలుండబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలై మేకింగ్ వీడియోలు, పోస్టర్లను చూస్తుంటేనే అర్థమవుతోంది.

ఇప్పటివరకు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు భారీ రెస్పాన్స్ వస్తుంది. అభిమానులు మాత్రం తమకు పోస్టర్లు వద్దు.. డైరెక్ట్ గా సినిమానే విడుదల చేయండంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు. అయితే రాజమౌళి మాత్రం వినూత్నంగా రోజుకోక ఫస్ట్ లుక్ విడుదల చేసి అభిమానుల అంచనాలను మరింత పెంచుతున్నాడు.

ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ ను ఈనెల 31న విడుదల చేయనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో త్వరలోనే విడుదల కానుంది. జులై 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

Satya Raj Kattappa First Look Poster-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Satya Raj  Kattappa?  First Look poster  Bahubali  

Other Articles