Baahubali | Karan johar | bollywood | movie news

Karan johar presenting hindi version of baahubali

Karan Johar presenting Hindi Baahubali, Karan Johar for Baahubali, Baahubali movie news, Baahubali movie stills, Baahubali stills, Baahubali movie updates, Baahubali making videos, Baahubali videos, Baahubali cast, Baahubali crew, Baahubali

Karan Johar presenting Hindi version of Baahubali: Director SS Rajamouli latest movie Bahubali. Trailer of the movie will be launched on 31 May. Movie is slated for July release.

కరణ్ జోహర్ సమర్పణలో హిందీ బాహుబలి

Posted: 05/01/2015 10:22 AM IST
Karan johar presenting hindi version of baahubali

తెలుగులో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘బాహుబలి’. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇందులో ప్రభాస్ సరసన అనుష్క, తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

భారీ సాంకేతిక నిపుణులు, భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు సినీ అభిమానులంతా కూడా ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం హిందీలో కూడా విడుదల కానుంది.

ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహర్ ‘బాహుబలి’ చిత్రాన్ని హిందీలో విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తాజాగా కరణ్ తన ట్విట్టర్ ద్వారా ఖరారు చేసారు. రాజమౌళి ఎంతో కష్టపడి తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ వంటి చిత్రాన్ని హిందీలో విడుదల చేసే అవకాశం దక్కడం చాలా గర్వంగా భావిస్తున్నాను అంటూ పోస్ట్ చేసాడు.

కరణ్ ట్వీట్ పై రాజమౌళి స్పందిస్తూ... కరణ్ తో కలిసి పనిచేయడం ఆనందంగా వుంది. ‘బాహుబలి’ చిత్రాన్ని ఆయన హిందీలో విడుదల చేయబోతుండడం సంతోషంగా వుంది అంటూ ట్వీట్ చేసాడు. కరణ్ జోహర్ లాంటి పెద్ద నిర్మాత ‘బాహుబలి’ చిత్రాన్ని హిందీలో విడుదల చేస్తున్నాడంటే... బాలీవుడ్ లో ‘బాహుబలి’ క్రేజ్ మరింత పెరిగే అవకాశాలున్నాయి.

ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్ర మొదటి భాగం ‘బాహుబలి ది బిగినింగ్’ పేరుతో విడుదల కానుంది. మే 31న ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. మే 1 నుంచి ‘బాహుబలి’ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  Karan johar  bollywood  movie news  

Other Articles