Bindu Madhavi | Health | Movie news

Actress bindu madhavi safe and healthy

Bindu Madhavi health, Bindu Madhavi safe, Bindu Madhavi news, Bindu Madhavi stills, Bindu Madhavi hot stills, Bindu Madhavi songs, Bindu Madhavi

Actress Bindu Madhavi safe and healthy: Actress Bindu Madhavi health condition and her movie details. stills, photos, gallery.

కావాలంటే చూడండి నేను బాగానే వున్నాను!

Posted: 04/02/2015 11:06 AM IST
Actress bindu madhavi safe and healthy

హీరోయిన్లు ఎప్పుడూ మీడియా ముందు కనిపిస్తూ వుండాలి... లేదంటే వాళ్లకు ఏమైనా అయ్యిందా? అనారోగ్యంగా వున్నారేమో అనుకుంటూ మీడియాలో ఏదో ఒక వార్తలొస్తూనే వుంటాయి. అయితే తాజాగా హీరోయిన్ బిందుమాధవి కాస్త మీడియాకు కనిపించడం మానేసిందో ఏమో... ఈ అమ్మడిపై పలు రకాల వార్తలొచ్చేసాయి. తాజాగా ఈ అమ్మడు ఓ సినిమా షూటింగ్ లో పాల్గొనడం వల్ల అస్వస్థతకు గురయ్యిందని, దీంతో వెంటనే హాస్పిటల్లో జాయిన్ అయ్యిందంటూ వార్తలొచ్చాయి.

కానీ ఈ పుకార్లపై బిందు మాధవి తాజాగా ఓ క్లారిటీ ఇచ్చేసింది. తన అనారోగ్యంపై వస్తున్న పుకార్లను ఎవరో పనికిమాలిన వారు సృష్టించిన గాలి వార్తలే తప్ప.. అందులో ఎలాంటి నిజం లేదని. తానే క్షేమంగా వున్నానని చెప్పుకొచ్చింది. ఇలా మాటలతో చెబితే నమ్ముతారో లేదో అని భావించిన బిందు మాధవి... ఓ సెల్ఫీని తీసి మరీ పంపించింది.

మరి ఇప్పటికే ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలే లేవు. తమిళంలో ఇప్పుడిప్పుడే వరుస చిత్రాలతో బిజీగా వున్న ఇలాంటి సమయంలో ఇలాంటి పుకార్లు వస్తే.. తన కెరీర్ కు ఇబ్బంది కలుగుతుందని భావించిన బిందు మాధవి... సరైన విధంగా స్పందించిందంటూ కోలీవుడ్ జనాలు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bindu Madhavi  Health news  Movie news  

Other Articles