Pawanism song gif

R Narayanamurthy launch Pawanism Song, R Narayanamurthy Pawanism Song, Rey Pawanism Song, Rey Pawanism Song release date, Rey Pawanism Song news, Rey Pawanism Song posters, Rey movie updates, Rey movie news, Rey posters, Rey songs

R Narayanamurthy launch Pawanism Song: Saidharam tej first movie Rey. Pawanism song releasing today evening 6pm. R Narayanamurthy release this song.

పవనిజం సాంగ్ విడుదల చేయనున్న పీపుల్స్ స్టార్

Posted: 03/17/2015 01:08 PM IST
Pawanism song gif

సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన మొదటి చిత్రం ‘రేయ్’.... ఇంకా విడుదలకు నోచుకోని విషయం తెలిసిందే. గతకొద్ది కాలంగా విడుదల కాకుండా వాయిదాలు పడుతూ వస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అయితే ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ‘పవనిజం’ అంటూ ఓ స్పెషల్ సాంగ్ ను ప్రమోషనల్ సాంగ్ గా కంపోజ్ చేసారు. ఈ పాటపై సాయిధరమ్ తేజ్ అదిరిపోయే స్టెప్పులను కూడా వేసినట్లుగా తెలిసింది. అయితే ఈపాటను ఈనెల 15న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేసారు.

ఈ పవనిజం పాటను ఈరోజు(మార్చి 17) సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ పాటను ప్రముఖ నటుడు, దర్శకుడు పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి చేతుల మీదుగా విడుదల కానుంది. వైవియస్ చౌదరి దర్శకనిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించారు. సయామీ ఖేర్, శ్రద్ధాదాస్ లు హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని మార్చి 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rey  Pawanism Song  R Narayanamurthy  YVS Choudary  

Other Articles