Tollywood handsome hero did liplock in up coming film

tollywood, gopichand, jil, jil audio, jil teaser, rasi khanna, jil wallpapers, liplock, gopichand wallpapers, gopichand updates, jil posters, jil audio, raasi khanna wallpapers, rasikhanna images, jil updates

tollywood handsome hero did liplock in up coming film.; Teasers of 'Jil' have shocked cinema lovers as action hero Gopichand and dazzling diva Raashi Khanna indulged in quite a passionate lip lock in the movie. That coming from a star hero, surely this is a shocker even for romance admirers. While top stars like Mahesh, Allu Arjun and Vishal too kissed and pecked on the lips, they haven't got much visibility.

లిప్ లాక్ సీన్లు చేసిన హాండ్సమ్ హీరో

Posted: 03/13/2015 10:20 AM IST
Tollywood handsome hero did liplock in up coming film

ఒక్కప్పుడు లిప్ లాక్ అంటే ఆమడ దూరం వెళ్లే హీరో, హీరోయిన్లు ఇప్పుడు మాత్రం లిప్ లాక్ లకు రెడీ అంటూ, స్ర్కీన్ పై రొమాన్స్ చేస్తు, చూసే వాళ్ల పల్స్ పెంచుతున్నారు. అయితే తెలుగు సినిమాల్లో కాస్త లిప్ లాక్ ల సందడి తక్కువే, అయినా క్రేజ్ మాత్రం బాగానే ఉంది. తెలుగు సినిమాల్లో టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున గీతాంజలి సినిమాతో ప్రారంభమైన లిప్ లాక్ సీన్, అప్పటి నుండి అడపాదడపా తెర మీద కనిపిస్తూనే ఉంది. నాగార్జున వారసుడిగా వచ్చిన అక్కినేని నాగచైతన్య కూడా లిప్ లాక్ లతొ అదరగొట్టారు. అయితే లిప్ లాక్ లతో తాను కూడా బరి ఉన్నానంటున్నాడు ఓ హ్యాండ్సమ్ హీరో.

హీరో అంటే ఇలా ఉండాలి, హైట్, వెయిట్, గ్లామర్ ఇలా అన్నింటిలోనూ హీరో గా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే వ్యక్తి గోపీచంద్. ఈ మధ్యే హిట్ ల బాటపట్టిన గోపీచంద్ పైట్లు, డ్యాన్స్ లతొనే కాకుండా లిప్ లాక్ సీన్లతోనూ అదరగొట్టడానికి మన ముందుకు రానున్నాడు. తాజాగా రానున్న జిల్ సినిమాలో గోపీచంద్ రాశిఖన్నాల మధ్య లిప్ లాక్ సీన్ విషయం బయటికి వచ్చింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందని, వీరి లిప్ లాక్ సీన్ ప్రేక్షకులకు టెంపరేచర్ పెంచుతుందని అప్పుడే అందరూ అంచాలు వేస్తున్నారు. అయితే ఎప్పుడూ లిప్ లాక్ ల జోలికి వెళ్లని గోపీచంద్ కూడా ఇలా రొమాన్స్ పాఠాలు చెప్పడం ఏంటో అని కొంతమంది అనుకుంటున్నా, జిల్ టీజర్ చూసిన వాళ్లు మాత్రం అదిరిపోయిందని తారీఫ్ ఇస్తున్నారు.

నిన్నటి దాకా చిన్నచిన్న సినిమాలు చేసిన రాశిఖన్నా, ఇండస్ట్రీలో పాతుకుపోయేందుకు మంచి దారే ఎంచుకుంది. తన గ్లామర్ తో మెరిపించి, మురిపించిన ఈ అమ్మడు ఇక లిప్ లాక్ లకు సిద్దపడింది. లిప్ లాక్ లకు పెట్టింది పేరుగా మారిన రెజీనా ఆండ్రియాకు నేను పోటీ అంటూ వస్తోంది రాశిఖన్నా. మరి సినిమా టీజర్ లో హీట్ పెంచిన ఈ హీరోయిన్, సినిమాలో ఎంత గ్లామర్ వలకబోసిందో చూడాలి. మొత్తానికి ముద్దంటే చేదా అనుకున్న వారు అదే ముద్దంటే మోజు అన్నట్లు చేస్తున్నారు. మరి టీజర్ అదిరింది ఇక సినిమా ఎలా అదిరిపోతుందో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tollywood  gopichand  jil  jil audio  jil teaser  rasi khanna  jil wallpapers  liplock  

Other Articles