Rajamouli baahubali movie release date confirmed

Rajamouli Baahubali release date confirmed, Rajamouli Baahubali release date, Baahubali release date confirmed, Baahubali movie news, Baahubali latest news, Baahubali release date fixed, Rajamouli tweets, Rajamouli latest tweets, Rajamouli movie news, Prabhas

Rajamouli Baahubali movie release date confirmed: Director SS Rajamouli Upcoming movie Bahubali going to release on may 15 grandly.

కన్ఫర్మ్: మే 15న బాహుబలి పార్ట్ 1 విడుదల

Posted: 03/04/2015 03:47 PM IST
Rajamouli baahubali movie release date confirmed

ప్రభాస్ ‘బాహుబలి’ సినిమా ఎప్పుడూ విడుదలవుతుందా అని సినీ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. బాహుబలి విడుదల తేది వచ్చేసింది. 2015లో విడుదలవుతుందని చెప్పిన బాహుబలి టీం, ఈసారి డేట్ ను కూడా ఫిక్స్ చేసారు. ఈ ఏడాది మే 15న ‘బాహుబలి’ పార్ట్ 1 ని విడుదల చేస్తున్నట్లుగా రాజమౌళి ప్రకటించారు.

భారీ బడ్జెట్ తో దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలోతెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, నాజర్ ,సత్యరాజ్ తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రెండు పాత్రలలో కనిపించనున్నాడు. మొదటి భాగంలో అనుష్కతో రానుండగా, రెండవ భాగంలో తమన్నాతో రొమాన్స్ చేయనున్నాడు.

గత రెండు సంవత్సరాలుగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టు ఎట్టకేలకు చివరి దశకు చేరుకుంది. ఇప్పటివరకు ఈ సినిమా విడుదల గురించి వస్తున్న వార్తలకు దర్శకుడు రాజమౌళి తాజాగా స్పందించారు. ఈ చిత్ర మొదటి పార్ట్ ను మే15న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

మే 15న సినిమా విడుదల కానుందంటే... ఏప్రిల్ నెలలో ఫస్ట్ లుక్ ట్రైలర్ మరియు ఆడియో విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలై మేకింగ్ వీడియోలకు భారీ స్పందన వస్తోంది. మరి ఈ సినిమా ఫస్ట్ లుక్ ట్రైలర్ ఎప్పుడు విడుదల చేస్తారో త్వరలోనే ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajamouli  Bahubali  Release date  

Other Articles