ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎప్పుడూ కూడా ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే వుంటాడు. ఎప్పుడూ కూడా ఎవరో ఒకరిపై కామెంట్లు చేయడం... లేకుండా సమాజంలో వుండే వారిపై మాత్రమే కాకుండా చివరకు దేవుడిపై కూడా కామెంట్లు చేస్తూ విమర్శలపాలవుతూ వుంటాడు. అలాంటి వర్మ తాజాగా నందమూరి అభిమానులు ఆగ్రహానికి గురయ్యే అవకాశాన్ని వర్మయే స్వయంగా రాసి తెచ్చుకున్నాడు.
వివాదాన్ని, విమర్శలను రాసి తెచ్చుకోవడం ఏంటని అనుకుంటున్నారా? అసలు విషయం ఏమిటంటే... తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా స్వర్గీయ నందమూరి తారకరామారావుకు ఎంత మంచి పేరుందో అందరికి తెలిసిందే. తెలుగు సినీ ఇండస్ట్రీకి ఓ పెద్ద నటుడిగా ఆయనను భావిస్తుంటారు. అలాంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ ను చూసి నటన నేర్చుకుంటే బాగుండేది అంటూ వర్మ ట్వీట్స్ చేసాడు.
ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘టెంపర్’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈనెల 13వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అయితే ఈ చిత్రంపై, అలాగే ఎన్టీఆర్ నటన గురించి వర్మ ఘాటు వ్యాఖ్యలు చేసాడు.
‘టెంపర్’ సినిమా చూసిన తర్వాత వర్మకు సీనియర్ ఎన్టీఆర్ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ దగ్గర చాలా విషయాలు నేర్చుకోవాలి అని అనిపించిందట. అంతే కాదు.. సీనియర్ ఎన్టీఆర్ కంటే ముందుగా జూనియర్ ఎన్టీఆర్ పుట్టివుంటే గనుక... ఈయనే పెద్ద స్టార్ అయ్యేవాడని అంటున్నాడు. ఇక అంతటితో ఊరుకోకుండా... వర్మ తన మనసుల్లో నుంచి ఓ మాట చెప్తానని.. ‘జూనియర్ ఎన్టీఆర్ తో పోలిస్తే సీనియర్ ఎన్టీఆర్ ఒక చాలా పెద్ద సూపర్ జీరో’ అని అన్నాడు. ఈ మాటలకు తెలుగుదేశం పార్టీ వారు మరియు సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు మళ్లీ ఏమైనా లొల్లి చేస్తారేమో అనుకొని... ‘ఇదంతా నేను టెంపర్ సినిమా చూసిన తర్వాత ఎమోషనల్ గా చెబుతున్నాను. నేను కూడా సీనియర్ ఎన్టీఆర్ అభిమానినే’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఏదేమైనా వర్మ మళ్లీ తన ఘాటు కామెంట్లతో ఈసారి నందమూరి అభిమానుల ఆగ్రహానికి గురయ్యేలా వున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వర్మ కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. మరి ఈ వర్మ కామెంట్లపై ఎవరెవరు ఎలా స్పందించనున్నారో అతి త్వరలోనే తెలియనుంది.
I was a super fan of NTR nd I never liked Tarak but after seeing Temper I think Tarak F...ed 5 decades of NTR
After seeing Temper I truly felt NTR himself should come back and learn lots of things from junior NTR
Junior NTR's Temper is about temperature raising of Senior NTR ...and that in a very very good way
After seeing Temper I believe that if Junior NTR was born before Senior NTR he would have become a far bigger star than senior NTR
I rarely go to theatre bt wanna watch Temper at bramahraambha 13th mrng at 5 am fr reliving my orgasmic experience of watching Adaviramudu
In 30 40 50'years of Senior NTR's I dint find a single film to compare with junior NTR in Temper
If at all spirits exist Senior NTR shud come nd watch Junior NTR's show in Bramarahmba..if he doesn't it will mean he's Jst jealous of Tarak
I care a f..on TDP reacting in an ignorant way .its my right as a swatantra Bharat pourudu to shift frm senior to junior nd reason is Temper
After seeing Temper I honestly from my heart feel that Senior NTR is a very big super Zero compared to Junior NTR
I saw Senior NTR's Adaviramudu 17 times and I feel like seeing Junior NTR's Temper 27 times
Aftr Temper NTR's vamsham wil b known as pre junior NTR and post junior Ntr nd in future Senior NTR will be known only becos of Junior NTR
If TDP has sense it should replace senior with junior cos junior is today nd tomorrow nd senior is yesterday and day before yesterday
No offence to senior NTR fans cos I am the biggest fan...this is just my emotional explosion after seeing Tarak in Temper
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more