Priya benerjee bags chance aishwarya rai movie

priya benerjee latest news, aishwarya rai latest news, priya benerjee jazba movie, priya benerjee hot photo shoot, aishwarya rai latest photo shoot, director sanjay gupta, bollywood movies

priya benerjee bags chance aishwarya rai movie : the bengali beauty priya benerjee bags a huge offer in aishwarya rai latest movie jabza which is to be directed by sanjay gupta.

ఐష్ చిత్రంలో ప్రియాకి విచిత్రంగా అవకాశం!

Posted: 01/19/2015 12:51 PM IST
Priya benerjee bags chance aishwarya rai movie

‘కర్మ’ చిత్రం ద్వారా తెలుగుతెరకు పరిచయమైన బెంగాలీ బ్యూటీ ప్రియా బెనర్జీ.. ఆ తర్వాత సందీప్ కిషన్ సరసన ‘జోరు’ చిత్రంలో చిందులువేసింది. అయితే.. ఆ రెండు చిత్రాలు ఫ్లాప్ కావడంతో తెలుగులో అంతగా గుర్తింపు దక్కలేదు. అందుకే.. మూవీ ఆఫర్లకోసం ఇండస్ట్రీల చుట్టూ చక్కర్లు కొడుతోంది. అయితే.. ఈ నేపథ్యంలోనే అమ్మడికి అనుకోకుండా చాలా విచిత్రంగా ఓ ఆఫర్ దక్కింది. అది కూడా మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యరాయ్ నటిస్తున్న బాలీవుడ్ మూవీలో! ఎలాగో తెలుసుకోవాలనుకుందా..? అయితే మేటర్’లోకి వెళ్లాల్సిందే!

ఎవరో ఒక వ్యక్తి ప్రియా బెనర్జీ వీడియోను ట్విట్టర్’లో పోసి, దర్శకుడు సంజయ్ గుప్తాకు ట్యాగ్ చేశాడు. ఆ వీడియో క్లిప్పింగ్’ను చూసిన సంజయ్.. తన సినిమాలోని ముఖ్యమైన పాత్రకు ప్రియానే పర్ఫెక్ట్ అని భావించి ఆమెను సంప్రదించాడు. దాంతో ఆమె దర్శకుడు చెంతకు చేరగా.. వెనువెంటనే ఆడిషన్స్ నిర్వహించడం జరిగింది. అందులో ఆమె చూపిన ప్రతిభను ఫ్లాట్ అయిన దర్శకకుడు.. ఆమెను సెలెక్ట్ చేసుకున్నాడు. ఇలా ఈ విధంగా అమ్మడికి బాలీవుడ్ ఆఫర్ వచ్చింది.

ఇదిలావుండగా.. దర్శకుడు సంజయ్ గుప్తా హిందీలో ‘జజ్బా’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే! ఇందులో మాజీవిశ్వసుందరి ఐశ్వర్యరాయ్ నటిస్తోంది. ఈమెతోపాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ దశలో వున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక ఈ చిత్రంతో ప్రియా దశ ఖచ్చితంగా తిరుగుతుందని సినీవిశ్లేషకులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles