Lakshmi manchu issue with dhanraj

Lakshmi manchu vs Dhanraj, Lakshmi manchu issue with dhanraj, Lakshmi manchu quarral dhanraj, Lakshmi manchu dhanraj issue, Lakshmi manchu pilavani perantam movie updates, Pilavani Perantam movie shooting, Pilavani Perantam movie photos, Pilavani Perantam latest, Dhanraj movies, Dhanraj movie updates, tollywood updates, upcoming telugu movies

Lakshmi Manchu issue with Dhanraj : Rumors that Lakshmi prasanna removes Dhanraj from Pilavani Perantam movie because of his comments on project. Dhanraj now planning to make a movie to take revange on Lakshmi manchu because of her insult on him.

నోరుజారితే, గెంటేసింది.. లక్ష్మిపై కమెడియన్ పగ..?

Posted: 01/03/2015 04:28 PM IST
Lakshmi manchu issue with dhanraj

అసలే టాలీవుడ్ అగ్ర ఫ్యామిలీల్లో వారిది కూడా ఒకటి. అలాంటి కుటుంబంతో ఓ చిన్న చేప కొట్లాట పెట్టుకుంటోంది. నోరుజారినందుకు గెంటివేస్తే.., పగ తీర్చుకునేందుకు పథకం రచిస్తోంది. టాలీవుడ్ లో ప్రస్తుతం మంచు లక్ష్మి వర్సెస్ ధన్ రాజ్ వివాదంపై తెగ చర్చలు జరుగుతున్నాయి. మంచు లక్ష్మి అంతగా ఫీల్ అయిందా.., ధన్ రాజ్ ను ఎలా అవమానించింది.., కమెడియన్ అగ్ర కుటుంబంపై ఎలా పగతీర్చుకుంటాడని అంతా మాట్లాడుకుంటున్నారు. ఇదేదో సినిమా స్టోరీ కాదు, నిజంగా జరిగిందట.

మంచు లక్ష్మి హీరోయిన్ గా నటిస్తున్న ‘పిలవని పేరంటం’ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. లేడి ఓరియంటెడ్ మూవీ కావటంతో లక్ష్మిదే హవా అని చెప్పాలి. కమెడియన్ ధన్ రాజ్ ఈ మూవీలో కీ రోల్ పోషిస్తున్నాడు. సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం సందర్బంగా నోరు అదుపులో పెట్టుకోలేక పోయిన కమెడియన్, ఈ మూవీలో తానే హీరో అని చెప్పాడు. దీంతో లక్ష్మికి చిర్రెత్తుకొచ్చింది. దీనికి తోడు ఇంతను ఎంతో చేసి చూపే మీడియా ధన్ రాజ్ తో లక్ష్మి మంచు అని స్టొరీలు రాసేసింది. ఇవన్నీ తెలుసుకున్న మంచు లక్ష్మికి కోపం వచ్చేసి, ధన్ రాజ్ ను సినిమా నుంచి తీసివేయించిందట.

సినిమాలో ప్రధాన క్యారెక్టర్ గా ఉన్న ధన్ రాజ్ ను తీసివేయటంపై ఫిలింనగర్ లో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన క్యారెక్టర్ ను తొలగిస్తే, ఇప్పుడు ఎవరు ఈ రోల్ పోషిస్తారా అని ప్రశ్నించుకుంటున్నారు. ఇదంతా అలా ఉండగా, తనును సినిమా నుంచి తీసివేయించటంపై ధన్ రాజ్ తీవ్ర అవమానంగా భావిస్తున్నాడట. ఎంతో కష్టపడి తనకు జరిగిన అవమానంకు సమాధానంగా, ‘ధనలక్ష్మి తలుపు తడితే’ అనే సినిమా తీస్తున్నాడట. ఇందులో మంచు ఆడపడుచుపై బాగానే సెటైర్లు ఉంటాయని చెప్తున్నారు. కొమ్ములున్నాయి కదా అని పొట్టేలు కొండును ఢీ కొడితే ఏమవుతుందో ఎవరూ చెప్పనక్కర్లేదు, ఇదే సమయంలో తెలివైన వాడి ముందు ఎంత పెద్దవాడైనా తల వంచక తప్పదు. మరి ధన్ రాజ్ ఇప్పుడు పొట్టేలులా దండెత్తుతాడా లేక తెలివైనవాడిగా బుద్ది చెప్తాడా అని అంతా ఎదురుచూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Lakshmi Manchu  Pilavani Perantam  Dhanraj  

Other Articles