Shankar i movie story line leaked

Shankar movie, I story line leaked, story line leaked by pc sriram, pc sriram leaked i movie story line, i movie latest updates, I telugu release date, I telugu songs, I manoharudu problems, tollywood updates, upcoming telugu movies, shankar movies, vikram movies

Shankar I movie story line leaked : Shankar movie I story line leaked by movie cinematographer. I getting ready to release on 14th january as sankranti gift to fans.

‘ఐ’ స్టోరీ లైన్ లీక్.., సినిమా సేఫ్

Posted: 01/03/2015 11:12 AM IST
Shankar i movie story line leaked

శంకర్ సినిమా ‘ఐ’ విడుదలకు సిద్దమవుతోంది. మరోవైపు సినిమా స్టోరీలైన్ బయటకు వచ్చేసి కలకలం రేపుతోంది. ఇదా సినిమా స్టోరీ లైన్ అని ఆసక్తిగా చర్చించకుంటున్నారు. సినమా విడుదల కాకముందే స్టోరీ లైన్ లీక్ కావటంతో ఇక మూవీ పని అయిపోయినట్లే అనుకుంటున్నారు. అయితే స్టోరీ లైన్ బయటకు వచ్చినా.., శంకర్ ఏం చేశాడు.., ఎలా చూపించాడు అనేది మాత్రం ఎవరూ ఊహించలేరు. కాబట్టి సినిమా సేఫ్ సైడ్ లోనే ఉంది. కాన్సెప్ట్ తెలిసినా.., ఎలా ప్రజెంట్ చేశారో చూడటానికైనా ప్రేక్షకులు థియేటర్ కు వస్తారని అంటున్నారు.

ఇంతకీ స్టోరీ లైన్ లీక్ చేసింది ఎవరంటే.., మూవీకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన పీ.సీ.శ్రీరామ్ అని తెలిసింది. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పొరపాటున నోరు జారి స్టోరీ లైన్ చెప్పేశాడట. ఇంకేముంది కాన్సెప్ట్ ను ఎలా డిజైన్ చేశాడా అని డిస్కషన్ మొదలు పెట్టారు. హాలీవుడ్ రేంజ్ అంటే ఎలా చూపించాడా అని సోషల్ మీడియాలో డిస్కషన్స్ మొదలయ్యాయి. ఇక సినిమా కథను చూస్తే.., మూడు పాత్రల్లో భాగంగా ఓ క్యారెక్టర్ లో ఒలంపిక్ క్రీడల నేపథ్యంగా సాగుతుందని తెలుస్తోంది. మిగతా రెండు క్యారెక్టర్లలో ఒకటి బాడీ బిల్డర్ వీరేశం కాగా రెండవ పాత్ర యాడ్ ఫిలిం మోడల్ లీ గా కన్పిస్తాడట.

సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ మూవీ విడుదల కానుంది. తెలుగులో ‘ఐ‘ ‘మనోహరుడు’ అనే ట్యాగ్ లైన్ తో వస్తోంది. డిసెంబర్ 30న వచ్చిన తెలుగు వర్షన్ పాటలకు బాగానే స్పందన వస్తుంది. ఆస్కార్ బ్యానర్ పై 180 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ సినిమాను తెలుగులో సూపర్ గుడ్ ఫిలింస్ విడుదల చేస్తోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : I movie  Shankar movies  tollywood updates  

Other Articles