Om mangalam mangalam starhunt song

Om Mangalam Mangalam, Om Mangalam Mangalam movie, Om Mangalam Mangalam star hunt, Om Mangalam Mangalam star hunt contest, Om Mangalam Mangalam new artists auditions, Om Mangalam Mangalam contest address, Om Mangalam Mangalam cast and crew, Om Mangalam Mangalam latest updates, Om Mangalam Mangalam shooting, telugu upcoming movies, tollywood latest, telugu movies updates

Om Mangalam Mangalam starhunt song : tollywood stars attracted by Om Mangalam Mangalam Star Hunt song video says its different and amazing way to pick new talent to industry. Om Mangalam Mangalam needs artists for hero, heroine and other character roles in movie. interested can send their one performance video more than one minute and mail

సారి అబ్బా... డేట్ అయిపోయింది

Posted: 12/29/2014 11:13 AM IST
Om mangalam mangalam starhunt song

టాలెంట్ ఉండే కళాకారులకు ఇండస్ర్టీలో ఆఫర్లు వస్తూనే ఉంటాయి. అవకాశం రావటమే చాలా కష్టం అవుతుంది. అలాంటి అవకాశాన్ని అందిస్తోంది ‘ఓం మంగళం మంగళం‘ మూవీ. కొత్తగా వస్తున్న ఈ సినిమా కొత్త కళాకారులను కోరుకుంటోంది. హీరో, హీరోయిన్ సహా ఇతర క్యారెక్టర్ల కోసం కొత్త వారిని వెతికే పనిలో ఉంది. ఆసక్తిగలవారు తమ పర్ఫార్మెన్స్ వీడియోను ఒక నిమిషం కంటే ఎక్కువ కాకుండా రికార్డు చేసి మెయిల్ చేయాలని తెలిపింది. వెంటనే కంగారు పడి యాక్టింగ్ మొదలు పెట్టేరు.. సో సారి. యు ఆర్ టూ లేట్. ఎందుకంటే కాంటెస్ట్ డేట్ డిసెంబర్ 25తో పూర్తయింది. ఇప్పటివరకు వచ్చిన వీడియోలను మూవీ యూనిట్ పరిశీలిస్తోంది. షార్ట్ లిస్ట్ అయిన వారికి త్వరలోనే ఆడిషన్ నిర్వహించి ఎవరు ఎంపికవుతారో చెప్పేయనుంది.

ఇక ఆడిషన్స్ కోసం రూపొందించిన ప్రమోషనల్ సాంగ్ చాలా పాపులర్ అయింది. ఓం మంగళం.. మంగళం, మంగళం అంటూ సాగే లిరిక్స్.., ఇండస్ర్టీలో తాజా సినిమాల్లో ఎంతమంది కొత్త హీరోలున్నారు. తాము ఎలా అవకాశం ఇవ్వబోతన్నాం అనే కాన్సెప్టును వివరిస్తూ చాలా చక్కగా ప్రమోషన్ సాంగ్ రూపొందించారు. ఈ పాటకు సినిమా స్టార్ల నుంచి మంచి మార్కులు పడుతున్నాయి. యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేసేందుకు చేస్తున్న కృషి బాగుందని మెచ్చుకుంటున్నారు. పాటనే ఇంత వినూత్నంగా ఉంటే.., సినిమా ఇంకెలా ఉంటుందా అని అప్పుడే ఆలోచనలను లెక్కగడుతున్నారు.

మధుర శ్రీధర్ రెడ్డి, ఎంవికె రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ఓం మంగళం మంగళం’ సినిమా ద్వారా సంజీవ్ రెడ్డి అనే దర్శకుడు ఇండస్ర్టీకి పరిచయం అవుతున్నాడు. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్న ఈ ప్రాజెక్టుకు ఇమ్రాన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. కొత్త కళాకారులతో సరికొత్త కాన్సెప్టుతో త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. పరిశ్రమను నమ్ముకుని.., టాలెంట్ ను నిరూపించుకునేందుకు వస్తున్న కళాకారులకు ‘తెలుగు విశేష్’ ఆల్ ది బెస్ట్ చెప్తోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Om Mangalam Mangalam  tollywood latest  upcoming movies  

Other Articles